Sarfira trailer : బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ చివరిగా.. “బడే మియా చోటే మియా” తో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన నటించిన మరో అవైటెడ్ చిత్రం “సర్ఫిరా” . తాజాగా ఈ సినిమాట్రైలర్ విడుదలైంది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన “సూరారై పోట్రు”కి రీమేక్ వెర్షన్. అదే సినిమా తెలుగులో ‘ఆకాశం నీహద్దురా’ గా అనువాదమవగా.. ఇక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది.

సర్ఫిరా ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. అక్షయ్ కుమార్ నటన హైలైట్ అని చెప్పవచ్చు. యంగ్ వెర్షన్ లో మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పరేష్ రావల్ తో పాటు రాధికా మదన్ కూడా ఈ చిత్రంలో నటించారు. ట్రైలర్ లో హీరో సూర్య కామియో పాత్రలో కనిపించడం మరో ఆసక్తికరమైన విషయం. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 12 న హిందీలో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!