చిత్రం : అక్షర

నటీన‌టులు: నందిత శ్వేత‌ , సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, సంజ‌య్ స్వ‌రూప్‌, అజయ్ ఘోష్ త‌దిత‌రులు

సంగీతం : సురేష్ బొబ్బిలి

ఛాయాగ్ర‌హ‌ణం: నగేష్ బ‌న్నెల్

ఎడిటింగ్ : జి.సత్య

ఆర్ట్ : నరేష్ బాబు తిమ్మిరి

నిర్మాత : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ

రచన – దర్శకత్వం : బి. చిన్నికృష్ణ విడుద‌ల‌

తేది : 26-02-2021

హీరోయిన్ నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అక్షర’. విద్యావ్యవస్థలోని లోపాల్ని చర్చిస్తూ సందేశాత్మక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అక్షర’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ : అక్షర (నందిత శ్వేత) అనే యువతికి అమ్మానాన్నలు లేరు. విశాఖలోని విద్యా విధాన్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుంది. స్టూడెంట్లలో ఉన్న భయాల్ని పోగొడుతూ టీచింగ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ కాలేజీకి డైరెక్టర్ శ్రీతేజ (శ్రీతేజ్)కి, అక్షరకు మధ్య ప్రేమ చిగురిస్తుంది. తన ప్రేమను వ్యక్తం చేసే సమయంలో శ్రీతేజ హత్యకు గురవుతాడు. ఇంతలో పెద్ద ట్విస్ట్ ఇస్తూ శ్రీతేజ తోపాటు ఏసీపీని కూడా తానే హత్య చేశానంటూ అక్షర పోలీసులకి లొంగిపోతుంది. అసలు వారిద్దరిని అక్షర హత్య చేసిందా? అసలు హత్య కు గల కారణాలేంటి? తదితర విషయాలు అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.

కథ విశ్లేషణ : ముఖ్యంగా నేటి విద్యా విధానంలో ర్యాంకుల కోసం కార్సొరేట్ సంస్థలు స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడుతున్న తీరును ఈ సినిమా సాగుతుంది. ఓ యువతి కార్పొరేట్ యాజమాన్యం తనకు చేసిన అన్యాయంపై ఎలా పగ తీర్చుకున్నదో మూవీలో చక్కగా చూపించారు. అందరూ సులభంగా సినిమాకు కనెక్ట్ అవుతారు. అక్కడక్కడ సాగతీత సన్నివేశాలు, కొన్నింటిని ప్రసంగాల తరహాలో చెప్పడంతో ప్రేక్షకులు నిరుస్తాహానికి గురవుతారు. అసలు కథ మొదలవడానికి చాలా సమయం తీసుకున్నాడు డైరెక్టర్. ఫస్టాప్ అంతా కూడా అనుకున్న కథకు అసలు సంబంధం అనేది ఉండకుండా సినిమా బోరింగ్ సన్నివేశాలతో కొనసాగుతుంది. శ్రీతేజ హత్య నుంచే అసలు కథ మొదలై ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది. తనను ప్రేమించిన శ్రీతేజ్‌ను, పోలీస్ ఆఫీసర్‌ను అక్షర ఎందుకు కాల్చి చంపింది? అక్షరకు హత్యలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది? అసలు అక్షర ఫ్యాష్ బ్యాక్ ఏమిటి? తనను ప్రేమించిన శ్రీతేజ్‌ను, పోలీస్ ఆఫీసర్‌ను అక్షర ఎందుకు కాల్చి చంపింది? అక్షరకు హత్యలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది? అసలు అక్షర ఫ్యాష్ బ్యాక్ ఏమిటి? విద్యా విధాన్ విద్యా సంస్థలో లెక్చరర్‌గా ఎందుకు చేరింది? షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ పాత్రలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం అక్షర. షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ పాత్రలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం అక్షర. మార్కులు, ర్యాంకుల అంటూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసే కార్పోరేట్ కాలేజీలపై సంధించిన విమర్శనాస్త్రం అక్షర చిత్రం. బేసిక్ పాయింట్‌ బాగున్నప్పటికీ.. దానిని వెండితెర మీద ఫీల్‌గుడ్ పాయింట్‌గా, వ్యవస్థను ఆలోచింప చేసేలా చేయడంలో తడబాటు కనిపిస్తుంది. వ్యవస్థలోని ఓ సీరియస్ అంశంపై దృష్టిపెట్టకుండా కమర్షియల్ హంగుల కోసం నాసిరకమైన కామెడీని జొప్పించడంతో భావోద్వేగమైన కథ తేలిపోయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల ఊహకు అందేట్లుగా ఉంటుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ : నందిత శ్వేత అక్షర గా సినిమాకు హైలెట్‌గా మారింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాగా రాణించారు. సంజయ్ స్వరూప్ తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. హర్షవర్ధన్ నటన బాగుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల ప్రాధాన్యత గురించి చెప్పిన విధానం సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. మిగిత నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే నిర్మాత సురేశ్ వర్మ మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ పాటించారు కాకాపోతే కథ, కథనాలపై మరింత దృష్టి పెడితే మెరుగైన ఫలితం రాబట్టే చాన్స్ ఉండేది. సామాజిక బాధ్యత అంశంతో వచ్చినప్పటికి అనవసరమైన సన్నివేశాల వలన కథకు ఉండే ఫీల్ ను ఆడియన్స్ మిస్ అవుతారు. చివరి అర్ధగంట సినిమాకు బలమైన పాయింట్‌గా మారింది. ప్రీ క్లైమాక్స్‌లో హర్షవర్ధన్ ఎపిసోడ్, అక్షర బాల్యంలోని ఎమోషనల్ సంఘటనలు సినిమాను భావోద్వేగంగా మారుస్తాయి. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడంతో సగటు ప్రేక్షకుడు ఆలోచింప చేసేలా మారుతాయి. ఓవరాల్‌గా దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ భేష్‌గా ఉన్నప్పటికి తెర మీదకు సరిగా తీసుకురాలేకపోయాడనే విషయం అర్ధం అవుతుంది. ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందోచూడాలి.

చివరిగా ‘అక్షర’ కు అభ్యాసం అవసరం

రేటింగ్ : 2.5/5

 

Leave a comment

error: Content is protected !!