Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏటా అభిమానులకు పండగే. ఈ ఏడాది ఆగస్ట్ 29న ఆ వేడుకలు మరింత ప్రత్యేకంగా సాగనున్నాయి. ఎందుకంటే, ఆయన అభిమానులకు ఇష్టమైన ‘మాస్’ సినిమా 4K ఫార్మాట్‌లో రీరిలీజ్ కాబోతోంది. 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో నాగార్జున కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
కొరియో గ్రాఫర్ రాఘవ లారెన్స్ మొట్టమొదటిసారిగా దర్శకుడిగా తన జెర్నీని ప్రారంభించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో జ్యోతిక, ఛార్మి కౌర్, రఘువరన్, రాహుల్ దేవ్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణ.
నాగార్జున పుట్టినరోజుకు ముందు రోజు అంటే ఆగస్ట్ 28న ఈ చిత్రం 4K ఫార్మాట్‌లో గ్రాండ్‌గా రీరిలీజ్ కానుంది. ఈ సినిమాను మరోసారి అద్భుతంగా ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఈ రీరిలీజ్‌ను చేపట్టారు. యాక్షన్, ఎంటర్‌టైనర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి మాస్ ఫీస్ట్. నాగార్జున పుట్టినరోజు వేడుకలు ‘మాస్’ మూవీ రీరిలీజ్‌తో మరింత ప్రత్యేకంగా సాగనున్నాయి. ఈ అవకాశాన్ని అభిమానులు వదలకుండా థియేటర్లకు వెళ్లి ఈ చిత్రాన్ని ఆస్వాదించాలి.