బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా నుంచి ‘గుచ్చే గులాబి’ పాటను అర్మాన్ మాలిక్ పాడగా, అనంత శ్రీరామ్, శ్రీమణి ఇద్దరు లిరిక్ రైటర్స్ కలిసి ఈ పాటను రాయడం ఓ విశేషం. పాటను గోపి సుందర్ స్వర పరిచారు.
ప్రేమించిన అమ్మాయి తరచూ ఎదురుపడటం తన ఆలోచనలోనుండి బయటికి వెళ్ళకుండా పదే పదే గుర్తుకు రావడం ఆమెనే తలచుకుంటూ తన దినచర్య ఎలా సాగుంటుంది అనేలా పాటలో సాహిత్యం చాలాబావుంది.
“అరె గుచ్చే గులాబి లాగా… నా గుండెలోతునే తాకినదే
వెలుగిచ్చే మతాబులాగా… నా రెండు కళ్ళలో నిండినదే”
అనే పల్లవితో మొదలైన పాటలో ప్రేయసి తనకు ఎలా గుర్తుకు వస్తుంది అనేది గుచ్చే గులాబి లాగా తన గుండెలోతునే తాకినదే అని ప్రేయసి వెలుగిచ్చే మతాబులాగా తన కళ్ళలో నిండినదే అని చాలా రొమాంటిక్ టచ్ తో స్టార్ట్ అవుతుంది.
తర్వాత ప్రేయసి తన్ను ఎలా ఆకర్షిస్తుంది అన్నట్లుగా వచ్చే లైన్స్ ఆకట్టుకున్నాయి.
“ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే
ఎదురై వచ్చి ఆపేసి నువ్వే… ఎదరేముందో దాచేసినావే
రెప్పల దుప్పటి లోపల… గుప్పెడు ఊహలు నింపావే
కుదురే కదిపేస్తావులే… నిదురే నిలిపేస్తావులే
కదిలే వీలే లేని… వలలు వేస్తావులే
ఎపుడూ వెళ్ళే దారినే… అపుడే మార్చేస్తావులే
నా తీరం మరిచి… నేను నడిచానులే”

మొదటి చరణంలో వచ్చే లైన్స్ లో
“నా అనుమతి లేకుండానే… నీ పలుకే పలికిందే
ఏమిటే ఈ వైఖరి… ఊరికే ఉంచవుగా మరి
అయ్యా నేనే… ఓ మాదిరి !!”
తనను తాను మరిచి పూర్తిగా ప్రేయసి ధ్యాసలో ఉన్నట్లు వివరించారు.

రెండవ చరణంలో వచ్చే లైన్స్ లో
” నీకోసం వెతుకుతూ ఉంటే… నే మాయం అవుతున్నానే
నను నాతో మళ్ళీ మళ్ళీ… కొత్తగ వెతికిస్తావే”
తను ప్రేయసినిని ఎంతగాతపిస్తూ తలపిస్తున్నాడో వివరించారు.
మొత్తానికి పాట మంచి రొమాంటిక్ టచ్ తో ఉండి ప్రేమికులందరితో పాటు అన్ని వర్గాల వారిని ఆ గుచ్చే గులాబి అలరిస్తుంది.

Lyrics  

అరె గుచ్చే గులాబి లాగా… నా గుండెలోతునే తాకినదే

వెలుగిచ్చే మతాబులాగా… నా రెండు కళ్ళలో నిండినదే, హే… యే

ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే

చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే

ఎదురై వచ్చి ఆపేసి నువ్వే… ఎదరేముందో దాచేసినావే

రెప్పల దుప్పటి లోపల… గుప్పెడు ఊహలు నింపావే

కుదురే కదిపేస్తావులే… నిదురే నిలిపేస్తావులే

కదిలే వీలే లేని… వలలు వేస్తావులే

ఎపుడూ వెళ్ళే దారినే… అపుడే మార్చేస్తావులే

నా తీరం మరిచి… నేను నడిచానులే

అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా

అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా

ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే

చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే

ఊపిరి పని ఊపిరి చేసే… ఊహలు పని ఊహలు చేసే

నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే

నేనేం మాటాడాలన్నా… నన్నడిగి కదిలే పెదవే

నా అనుమతి లేకుండానే… నీ పలుకే పలికిందే

ఏమిటే ఈ వైఖరి… ఊరికే ఉంచవుగా మరి

అయ్యా నేనే… ఓ మాదిరి !!

అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా

అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా

ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే

చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే

నీకోసం వెతుకుతూ ఉంటే… నే మాయం అవుతున్నానే

నను నాతో మళ్ళీ మళ్ళీ… కొత్తగ వెతికిస్తావే

బదులిమ్మని ప్రశ్నిస్తావే… నను పరుగులు పెట్టిస్తావే

నేనిచ్చిన బదులుని మళ్ళీ… ప్రశ్నగ మారుస్తావే

హే పిల్లో..! నీతో కష్టమే

బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే… నన్నడుగుతు ఉంటే ఏం న్యాయమే

అరె గుచ్చే గులాబి లాగా… నా గుండెలోతునే తాకినదే

వెలుగిచ్చే మతాబులాగా… నా రెండు కళ్ళలో నిండినదే, హే… యే

ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే

చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే

ఎదురై వచ్చి ఆపేసి నువ్వే… ఎదరేముందో దాచేసినావే

రెప్పల దుప్పటి లోపల… గుప్పెడు ఊహలు నింపావే

కుదురే కదిపేస్తావులే… నిదురే నిలిపేస్తావులే

కదిలే వీలే లేని… వలలు వేస్తావులే

ఎపుడూ వెళ్ళే దారినే… అపుడే మార్చేస్తావులే

నా తీరం మరిచి… నేను నడిచానులే

అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా

అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా 

Leave a comment

error: Content is protected !!