ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులనుంచి సెలబ్రిటీస్ వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని పలువురు వివిధరకాలుగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ .. ఈ విషయంలో చాలా ముందున్నారు. కొందరు ఇంటిపనులు, వంట పనులు చేస్తుంటే.. మరికొందరు కథలు, కవిత్వం, చిత్రలేఖనం లాంటి వాటిలో తమ ప్రతిభ చూపిస్తున్నారు. ఇంకొందరు తమకిష్టమైన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు చక్కగా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని చాలా మంది జనాలని ఎంటర్టైన్ చేసే పనిలో పడ్డారు.

ఇప్పుడు అలాగే హీరో ఆకాష్ పూరి చేసిన ఒక్క చాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.స్టార్ హీరోల సినిమాలలోని డైలాగ్స్ చెబుతూ ఆకాష్ పూరి, నటుడు రాహుల్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. తెలుగు అగ్ర హీరోల సినిమాలలోని డైలాగ్స్ చెప్పి చివరిలో ఒక్క‌ఛాన్స్‌. ఒకేఒక్క‌ఛాన్స్‌ అంటూ ముంగించేశారు.

Leave a comment

error: Content is protected !!