ARM movie trailer : మలయాళ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో టోవినో థామస్ నటించిన లేటెస్ట్ ఏఆర్‌ఎం (అజయండే రండామ్ మోషణమ్‌). ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టోవినో కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది ఈ సినిమా. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదలై సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటించారు.

ట్రైలర్ ప్రకారం.. ఈ సినిమా మూడు తరాల కథను కలిగి ఉంది. టొవినో మూడు భిన్నమైన పాత్రలలో కనిపిస్తూ, ఒక ముఖ్యమైన నిధిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న కుటుంబ కథను చూపిస్తుంది. “మీ తాత ఈ ఊరి మీద గెలిచిన దొంగ” అనే సంభాషణ ద్వారా, ఈ కుటుంబం దొంగతనంతో సంబంధం కలిగి ఉందని తెలుస్తుంది.

టోవినో పోషించిన పాత్రలు ఈ నిధిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ట్రైలర్‌లోని ప్రధాన ప్రశ్న “దొంగ ముందా? పోలీసు ముందా?” అనేది. టొవినో పాత్రలు దొంగలేనా లేక నిజాయితీపరులేనా అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. హోమ్ బలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 12న విడుదల కాబోతోంది.

Leave a comment

error: Content is protected !!