నేటి తరం హీరోయిన్స్‌ లో యాక్టింగ్‌ కి స్కోప్ ఉన్న పాత్రలతో అలరించే నటి ఐశ్వర్య రాజేష్‌. సంక్రాంతి కి వస్తున్నాం మూవీలో ఐశ్వర్య రాజేష్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు.. అదే సందడి రీసెంట్‌గా కలర్స్‌ హెల్త్‌ కేర్‌ బంజారాహిల్స్‌ బ్రాంచ్‌లోనూ చేసింది. ప్రముఖ హెల్త్‌ కేర్ సంస్థ ‘కలర్స్‌’ ఇప్పుడు బంజారా హిల్స్‌లో కలర్స్‌ హెల్త్‌కేర్‌ 2.0 ను రూపొందించింది. ఈ బ్రాంచ్‌ను ఐశ్వర్య రాజేష్‌ ప్రారంభించారు.
హెల్త్‌ కేర్ అందరికీ ఎంతో అవసరమనీ.. కలర్స్‌ హెల్త్‌ కేర్‌ 2.0 లో అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి హెల్త్‌ మెరుగుపరుస్తున్నారనీ, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఐశ్వర్య రాజేష్‌. సంక్రాంతికి వస్తున్నాం ఎలా బ్లాక్‌బస్టర్‌ అయ్యిందో.. ఈ కలర్స్‌ హెల్త్‌ కేర్‌ 2. 0 కూడా అంతే బ్లాక్‌బస్టర్‌ కావాలని కోరారు.
‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అతిథులుగా పాల్గొన్న‌ మిన‌ర్వా హోట‌ల్స్ అధినేత‌, మాజీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, సీబీఐటీ డైరెక్ట‌ర్ దివ్యారెడ్డి నిర్వాహ‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!