Venky – Anilravipudi : విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో ఒక నాయికగా మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు తెలుసు. తాజా సమాచారం ప్రకారం, మరో నాయిక పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ను ఎంపిక చేసినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.

సోమవారం, ఈ చిత్రం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రబృందం బాపట్ల జిల్లా శింగరకొండలోని ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “ఇది యాక్షన్ నేపథ్యంలో సాగే కథాచిత్రం. ఐశ్వర్య రాజేశ్ వెంకటేశ్ భార్యగా, మీనాక్షి చౌదరి ఆయన ప్రియురాలిగా నటిస్తారు. ఈ నెల 3 నుండి చిత్రీకరణ ప్రారంభించి, నవంబర్‌లో పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.

Leave a comment

error: Content is protected !!