వర్జిన్‌ స్టోరీ ఆహా అనిపిస్తోంది. ఓటీటీ వరల్డ్ లో వండర్‌ఫుల్‌ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ట్రెండీ కంటెంట్‌తో వ్యూవర్స్ చేత వావ్ అనిపిస్తున్నాయి వెబ్‌సిరీస్‌లు. అలాంటి వెబ్‌సిరీసే వర్జిన్‌ స్టోరీ. ఆహాలో స్ట్రీమ్‌ అవుతున్న ఈ వెబ్‌సిరీస్‌కు భారీగా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. బాల నటుడిగా రేసుగుర్రం , పటాస్‌, రుద్రమదేవి లాంటి చిత్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని గోలీసోడా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్రమ్‌ లగడపాటి.. ఈ సిరీస్‌లో మెయిన్‌ లీడ్ చేసాడు.
బాల నటుడిగా స్టార్‌ హీరోల చిన్నప్పటి పాత్రలు చేసిన విక్రమ్‌ లగడపాటి.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో ముస్లీం కుర్రాడిగా.. దిల్‌ రాజు మూవీ రౌడీ బోయ్స్‌లో వన్‌ ఆఫ్ ది రౌడీ కుర్రాడిగా మెప్పించాడు. ఇప్పుడు వర్జిన్‌ స్టోరీతో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మొత్తానికి మేకర్స్‌ దృష్టిలో విక్రమ్‌ లగడపాటి స్టార్ మెటీరియల్ అనిపించుకుంటున్నాడు. ‌
ప్రదీప్‌ అట్లూరి డైరెక్షన్‌లో యూత్‌ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌లో విక్రమ్‌ లగడపాటి కి జోడీగా సౌమిక యాక్ట్‌ చేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఓటీటీ లవర్స్‌ ని ఆకట్టుకుంటోంది వర్జిన్‌ స్టోరీ. ఈ వెబ్‌సిరీస్‌ కు వచ్చిన ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ.. చేయబోయే ఓ వెబ్‌సిరీస్‌తో పాటు. ఓ సినిమా డిటేల్స్‌ త్వరలో అనౌన్స్‌ చేయబోతున్నట్టు ప్రకటించాడు విక్రమ్‌ లగడపాటి.

Leave a comment

error: Content is protected !!