చిత్రం: మేజర్
నటి నటులు: అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్, రేవతి, మురళీ శర్మ
దర్శకుడు: శశికిరణ్ తిక్క
నిర్మాణం: మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఎ ఫ్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజీవ్ భరద్వాజ్
స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే: అడివి శేష్
స్క్రిప్ట్ గైడెన్స్, తెలుగు డైలాగ్స్: అబ్బూరి రవి
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
ఎడిటింగ్: ఎస్ వినయ్‌కుమార్, కె.పవన్‌కల్యాణ్
టాలీవూడ్ గోల్డెన్ హీరో అడివి శేష్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. తొలిసారి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’. గూఢచారి ,మూవీ ఫేమ్ “శశికిరణ్ తిక్క” దర్శకత్వం వహిస్తున్న ‘మేజర్’ చిత్రంలో ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డు) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో చేసారు అడివి శేష్. ముందుగానే, ప్రీ రీలిజ్ స్క్రీనింగ్ థియేటర్ లో ఇండియా వైడ్ గా బాగా బజ్ క్రియేట్ చేసి, భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఎ ఫ్లస్ ఎస్ మూవీస్ సంస్థల అసోసియేషన్‌తో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. అన్ని భాషల్లో రీలిజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించిందో..!! లేదో తెలుసుకుందాం..!!
కథ:
సందీప్ ఉన్నికృష్ణన్ (అడివి శేష్) చిన్నప్పటి నుంచి ధైర్యశాలి, బాగా తెలివైన వాడు. కాలేజ్ డేస్ లో ఇషా (సాయి మంజ్రేకర్) & అడివి శేష్ ఇద్దరు ప్రేమించుకుంటారు. అడివి శేష్ కి చిన్నప్పటి నుంచి న్యావి లో జాయిన్ అవ్వాలని కోరిక. కానీ, అది ప్రయత్నించడంలో ఫెయిల్ అవ్వుతాడు. అది తెలిసిన ఇషా (సాయి మంజ్రేకర్) ఒక ఐడియా ఇస్తుంది. దాంతో, అడివి శేష్ ఆర్మీ లో జాయిన్ అవ్వుతాడు. ఆర్మీ లో జాయిన్ అయ్యాక, ఇషా తో పెళ్లి అవ్వడం. ట్రైనింగ్ లో అడివి శేష్ కి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. అసలు సోల్జర్ అంటే ఏంటి ? అని తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక, ఒక రోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు మూకుమ్మడి గా తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ మీద దాడి చేస్తారు. అప్పుడు, ఎన్ఎస్జీ మేజర్ కమాండో గా ఉన్న సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా ముంబై 26/11 ఉగ్రవాద దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు ? ముందుండి తన ఎన్ఎస్జీ టీం తో ఎలా ముందుకి సాగాడు అనేది కథ ?
కధనం,విశ్లేషణ:
కథనంలో కి వెళ్తే సందీప్ ఉన్నికృష్ణన్ (అడివి శేష్) జీవితంలో తనకి ఏం కావాలో చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. దేశం కోసం పోరాడే సందీప్ ఉన్నికృష్ణన్ ఒక నిజమైన సోల్డజర్. కన్న కొడుకు ఆర్మీ కి వెళ్తున్నాడన్న, ప్రాణాలు కోల్పోయాడు అన్న, తల్లి తండ్రులు గా పడే నరకం అంతా ఇంతా కాదు. అడివి శేష్ కి తల్లి తండ్రులు గా నటించిన ప్రకాష్ రాజ్, రేవతి కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాలో ఎమోషనల్ గా సాగుతాయి. సందీప్ ఉన్నికృష్ణన్ అందరి లాగే ఒక సాధారణమైన వ్యక్తి. సాయి మంజ్రేకర్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని మనస్పర్థలు నుంచి విడాకులు దాకా దారి తీస్తుంది. అలాంటి టైం లో కూడ దేశం కోసం సందీప్ ఉన్నికృష్ణన్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడే ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అన్ని సగటు ఆడియెన్స్ ని
ఏడిపించేస్తుంది. ఇక పోతే, సినిమా అక్కడక్కడ స్లో గా ఉండటం, ఎడిటింగ్ కి ఇంకా పదును చెప్పకపోవడం, యాక్షన్ సీక్వెన్స్ మీద అంత గా క్లిక్ అవ్వకపోవడం. ఇలాంటివి ఉన్న, అడివి శేష్ పీక్ పెర్ఫామెన్స్ తో సినిమా ని ఒక రేంజ్ లో తీసుకెళ్లాడు. సో, ఈ సినిమా ని తప్పకుండ థియేటర్ లో చూడాల్సిన సినిమా.
నటి నటుల పెర్ఫామెన్స్:
ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్” పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు అడివి శేష్. ఈ మూవీ తో తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా, సినిమా మొత్తం తన భుజాల మీద నడిపించాడు. సాయి మంజ్రేకర్ తన పాత్ర కి తగ్గట్టు బాగానే యాక్ట్ చేసింది కానీ, పెద్దగా ఎక్సప్రెషన్స్ ఇవ్వలేకపోయింది. శోభితా ధూళిపాళ్ల పర్వాలేదు అనిపించారు. సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్ గారు యాక్టింగ్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి. రేవతి, మురళీ శర్మ యాక్టింగ్ బాగుంది.
సాంకేతిక వర్గం:
అడివి శేషు ని “ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్” పాత్రలో చూపించడం లో బాగా సక్సెస్ అయ్యారు. కానీ, ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లో గా ఉన్న సినిమా మొత్తం సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ “శ్రీచరణ్ పాకాల” మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ విభాగంలో ఇంకొద్దిగా శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. వంశీ పచ్చిపులుసు కెమెరా పని తీరుహైలెట్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా కథ కి తగ్గట్టు గా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.
రేటింగ్: 3.5/5
బాటమ్ లైన్: హ్యాట్సాఫ్ టు “మేజర్”
Review – Tirumalashetty Venkatesh