అందమైన ముఖం.. ఆకర్షించే కళ్ళు..  నున్నటి బుగ్గలు.. సన్నటి నడుము..  వొంచిన విల్లులాంటి ఒళ్ళు… చిలిపి తనం.. కొంటెదనం.. కలగలిసిన చూపులు.. వాటికి తోడు చక్కటి చిరునవ్వు.. కలగలిస్తే.. అదా శర్మ. పోతసోసిన ఆ గ్రీకు శిల్పం ఉత్తర, దక్షిణాది ప్రేక్షకుల్ని తన అందంతో ఆకట్టుకుంది.. అభినయంతో కట్టిపడేసింది.

పూరీ జగన్నాథ్ హార్ట్ ఎటాక్ తో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి.. తొలి చిత్రంతోనే యూత్ కు అభిమాన హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమాకు హైలెట్‌గా ఉన్న అంశాల్లో ఆదా శర్మ అందచందాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆమె హాట్ స్టిల్స్ చూసే చాలా మంది కుర్రాళ్లు థియేటర్ల వరకు వెళ్లారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. ‘హార్ట్ ఎటాక్’ తర్వాత అదా శర్మ తెలుగులో నటించిన చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ చిత్రంలో దర్శకుడు త్రివిక్రమ్ ఆమెను పాత్రను సరిగా చూపించలేని, అందం పరంగా కూడా ఆమెను హైలెట్ చేయలేదనే అభిప్రాయం సైతం వ్యక్తం అయింది. హార్ట్ ఎటాక్ తర్వాత మంచి సినిమా పడి ఉంటే అదా శర్మ రేంజి మరింత పెరిగేది. కానీ అలా జరుగలేదు. మరో తెలుగు మూవీ ‘గరం’లో నూ, ఆపై అడవి శేష్ క్షణంలోనూ ,రాజశేఖర్ కల్కి లోనూ నటించి సత్తా చాటుకుంది. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో సైతం తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఇంకా మరిన్ని చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషిస్తోంది. నేడు అదా శర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ అందాల బొమ్మకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే అదా శర్మ.

Leave a comment

error: Content is protected !!