Srikanth : విలక్షణ నటుడు శ్రీకాంత్ బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారనే వార్తలను ఖండించారు. తాను ఆ పార్టీకి వెళ్ళలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తన ఇంటి నుంచి వీడియో విడుదల చేసిన శ్రీకాంత్.. కొంతమంది తనలానే ఉన్నారని, అందుకే పొరపాటు జరిగిందని అనుకుంటున్నట్లు చెప్పారు.
రేవ్ పార్టీలకు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదని, ఎప్పుడైనా బర్త్‌డే పార్టీలకు వెళ్లినా కొంతసేపు మాత్రమే ఉంటానని తెలిపారు. గతంలో తనకు విడాకులు ఇచ్చారని, ఇప్పుడు రేవ్ పార్టీలో పాల్గొన్నారనే పుకార్లు పుట్టించారని అన్నారు. ఈ వార్తలు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలను నమ్మవద్దని, తాను ఇంట్లోనే ఉన్నానని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.