చిత్రం: ఆచార్య

నటీనటులు: చిరంజీవి, రాం చరణ్ తేజ‌, పూజా హెగ్డే, సోనుసూద్, తనికెళ్ళ భరణి, అజయ్, కిషోర్, రెజీనా & సంగీత (ప్రత్యేక గీతం), వెన్నెల కిషోర్, బెనర్జీ, జిస్సు సెంగుప్తా, సత్య దేవ్.

సంగీతం: మణిశర్మ

ఛాయాగ్రహణం: తిరు

నిర్మాత: నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్

బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్

రచన, దర్శకత్వం:  కొరటాల శివ

 

తెలుగు సినిమా ఖ్యాతి ని పెంచిన “ఆర్ ఆర్ ఆర్” సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన సైలి తో, తండ్రి కి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలాంటీ సినిమా తరువాత ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో తెలుగు స్టేట్స్ లో వచ్చిన సినిమా “ఆచార్య”. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి వరుస హిట్స్ తరువాత మెగా స్టార్ చిరంజీవి గారు, అబ్బాయి మెగా పవర్ స్టార్ తో నటించిన సినిమా “ఆచార్య”. ఈ ఇద్దరి స్టార్స్ కలయికలో వచ్చిన, ఈ ఆచార్య సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుందా..! లేదా..! అనేది తెలుసుకుందాం..!!

 

కథ: ధర్మాన్ని నిత్యం పూజించే అక్కడి స్థానిక ప్రజలకు, ఎటువంటి ఆపద వచ్చిన అండగా ఉండే గ్రామం “ధర్మస్థలి”. అలాంటి ధర్మస్థలి కి సంరక్షకుడు సిద్ధ (రామ్ చరణ్). ఎలాంటి ఆపద వచ్చిన, తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి  కాపాడే పవర్ ఫుల్ క్యారెక్టర్ “సిద్దా” (మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్”). “ధర్మస్థలి” లో పూజారి గా పనిచేసే తనికెళ్ళ భరణి కూతురు అయ్యిన నీలాంబరి (పూజ హెగ్డే) తో సిద్దా మనసులో పడతాడు. మరో పక్క, బసవ (సోను సూద్) సిద్దా కి ఎదురీత గా, ధర్మ స్థలి ని దక్కించుకునే దశలో, సిద్ద ని కత్తి తో బసవ (సోను సూద్) వెన్ను పోటు పొడుస్తాడు. కొద్దీ సేపటి తరువాత చావు బతుకుల్లో పడిపొయ్యి ఉన్న సిద్ధ ని చూసి, ఆచార్య (మెగా స్టార్ చిరంజీవి) అడవుల్లోకి తీసుకెళ్ళిపోతారు? అసలు ఆచార్య కి సిద్ద కి రిలేషన్ ఏంటి? చావు బతుకుల్లో ఉన్న సిద్ద ని ఆచార్య కాపాడారా ? సిద్ద కనుమరుగైపోయాక “ధర్మస్థలి” ని ఎవ్వరు కాపాడారు? అసలు “ధర్మ స్థలి” కి వచ్చిన సమస్య ఏంటి ?

కథనం, విశ్లేషణ:

తెలుగు సినిమాలలో “కొరటాల శివ” ది ప్రత్యేక సైలి. ఎందుకంటే, మౌనంతో హీరో మ్యానరిజం ని మరింత స్క్రీన్ మీద బలపరుస్తారు. గతంలో అయ్యన రాసిన కథలతో వచ్చిన చిత్రాలు దానికి బెస్ట్ ఎగ్జాఫుల్: మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్. ఎన్నో అంచనాలతో  కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన “ఆచార్య”, ఇద్దరి మెగా స్టార్స్ ని ఒకే ఫ్రెమ్ లో చూపించటం ఫ్యాన్స్ కి పండగనే చెప్పుకోవాలి. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్  సినిమా కి ఒక అసెట్.

అసలు ఈ సినిమా కథ మొత్తం “ధర్మస్థలి” చుట్టూ నడుస్తుంది. చిరంజీవి, రామ్ చరణ్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా చిరుత సీన్ అలాగే, కొద్దీ పాటి కామిడి ట్రాక్. అలాగే, కొన్ని చోట్ల కొరటాల శివ గారు కాస్త పట్టు కోల్పోయి రెగ్యులర్ ఫార్మేట్ లో వెళ్లి బోర్ కొట్టినట్టు అనిపిస్తుంటుంది. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు బలం. సిద్ధ రోల్ లో రామ్ చరణ్ కూడా అద్భుతంగా నటించాడు.

నటి నటుల పెర్ఫార్మెన్స్:

“ఆర్ ఆర్ ఆర్” సినిమా తో హౌరా అనిపించుకున్న రామ్ చరణ్, ఆచార్య సినిమా “సిద్ద” క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. అదే విధంగా మెగా స్టార్ చిరంజీవి  స్క్రీన్ మీద తన దైన స్టైల్ లో డాన్స్, ఫైట్స్ తో అదరగొట్టారు. తండ్రి కొడుకులు కలయికలో వచ్చే ప్రతి సీన్ థియేటర్ లో నిలబెడుతుంది. ఇక ఈ సినిమాలో తమ నటనతో ఆకట్టుకున్న తనికెళ్ళ భరణి, అజయ్, వెన్నెల కిషోర్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే, పూజ హెగ్డే పాత్ర కూడ ఉన్నంతలో బాగానే మెప్పిస్తుంది. ఇక విలన్ గా నటించిన సోను సూద్, జిస్సు, సౌరవ్ లోకేష్ పర్వాలేదనిపిస్తారు. సంగీత, రెజినా స్పెషల్ సాంగ్స్ తో మెప్పిస్తారు.

సాంకేతిక వర్గం:

సినిమా మొత్తానికి హైలెట్ సీనంటే చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో సెకండాఫ్ లో వచ్చే చిన్న కామెడి తో కూడిన ఫైట్ సీన్. ఈ సీన్ లో ఇద్దరు అదరగొట్టారు. చిరంజీవి గారి సినిమా అంటే చాలు మణిశర్మ గారికి పూనకం వస్తుంది. వీళ్ళద్దిరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ హిట్. ముఖ్యంగా భజే బంజార సాంగ్ లో చిరు, చరణ్ కలిసి చేసే స్టెప్స్ హైలెట్. ఆచార్య సినిమాలో కూడ సాంగ్స్ ప్రేక్షకులని బాగా అలరిస్తాయి. తీరు గారు చూపించిన కెమెరా పనితనం అద్భుతం. ఆర్ట్ డైరెక్టర్ వర్క్  ఈ సినిమా కి చాలా అసెట్.

రేటింగ్:  3

బాటమ్ లైన్:  తడబడిన  “ఆచార్య “

 

 

Leave a comment

error: Content is protected !!