హ్యాండ్సమ్ ఫేస్ .. లవ్లీ స్మైల్.. మ్యాన్లీ లుక్స్ … స్టైలిష్ హెయిర్ కట్. ఒకప్పుడు సౌత్ లో అతడు యువతకు అభిమాన హీరో. అమ్మాయిల కలల రాకుమారుడు. ప్రేమదేశానికి రొమాంటిక్ రాకుమారుడు. లెక్కకు మించిన ప్రేమకథా చిత్రాలతో అప్పటి తరం జెనరేషన్ ను మెప్పించిన లవర్ బాయ్. పేరు అబ్బాస్. మోడలింగ్ రంగం నుంచి సినీ రంగానికి ప్రవేశించిన అతగాడు.. ఒక దశలో బిజీ హీరో.
బాలీవుడ్ నటుడు ఫిరోజ్ ఖాన్ అబ్బాస్ కు దూరపు చుట్టం. చిన్నప్పటినుంచి హిందీ , బెంగాలీ సినిమాలు చూసి పెరిగిన అతడు.. తానుకూడా సినిమాల్లోకి ప్రవేశించి.. స్టార్ హీరో అవ్వాలని కలలు కన్నాడు. దానికి దగ్గర దారిగా మోడలింగ్ ను ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు. ఒక వైపు మోడలింగ్ చేస్తూనే.. మరో వైపు సినిమాల్లో ప్రవేశానికి తీవ్రంగా కృషి చేశాడు. అయితే అతడిని అదృష్టం తమిళ దర్శకుడు కదిర్ రూపంలో తలుపు తట్టింది. ప్రేమదేశం చిత్రం తెరకెక్కిస్తోన్న దశలో .. ఒక హీరోగా మలయాళ హీరో వినీత్ ను ఎంపికచేసిన కదిర్… అందులో రెండో హీరోగా అబ్బాస్ ను ఎంపికచేశాడు. ఆ సినిమా ప్రేమదేశం. ఆ సినిమా సూపర్ హిట్టయ్యాకా తన సెలెక్షన్ కు తిరుగులేదని భావించాడు కదిర్. వెరైటీ హెయిర్ కట్ తో, హ్యాండ్సమ్ ఫేస్ తో తెరమీదకు వచ్చిన అబ్బాస్.. తొలి చిత్రంతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అబ్బాస్ హీరోగా పలు చిత్రాలు దక్షిణాదిన తెరకెక్కాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన అబ్బాస్ .. 2016 వరకూ ఏదో ఒక భాషలో నటిస్తూనే ఉన్నాడు. అలాగే.. అతగాడు రెండు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించాడు. ఈ రోజు అబ్బాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ హ్యాండ్సమ్ హీరోకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే అబ్బాస్ ..