Aamir – Salman : 90ల దశకంలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఇద్దరు సూపర్ స్టార్లు ఆమిర్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ మళ్లీ కలిసి తెరపై కనిపించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1994లో వచ్చిన ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ డ్యూయో మళ్లీ కలిసి నటించాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ కోరికను నెరవేర్చే దిశగా ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ 2010లో “అందాజ్ అప్నా అప్నా” సినిమా తర్వాత ఆమిర్ ఖాన్‌తో నటించే అవకాశం రాలేదని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ తాజాగా “మేము దీని గురించి చాలా ఆలోచిస్తున్నాము” అని రీట్వీట్ చేసింది. దీంతో అభిమానులు ఉత్సాహంగా ఈ వార్తను స్వాగతిస్తున్నారు. ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమా విడుదలైన దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు మళ్లీ కలిసి నటించబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆమిర్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ కలిసి నటించే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!