Aamir Khan : బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల అసాధారణ ప్రతిభను వెలికితీసే కథాంశంతో రూపొందిన “తారే జమీన్ పర్” సినిమా 2007లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది, బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయం సాధించింది. ఆమిర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా “సితారే జమీన్ పర్” అనే సినిమాను ప్రముఖ దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ సరసన జెనీలియా నటిస్తుండగా, దర్శీల్ సఫారీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “తారే జమీన్ పర్” ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించిందని, “సితారే జమీన్ పర్” అందరినీ నవ్విస్తుందని చిత్రబృందం తెలిపింది. షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!