రాజశేఖర్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో ‘ఆహుతి’ ఒకటి. 1988 లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. నిజానికి ఈ సినిమా మోహన్ లాల్ నటించిన ‘రాజావిండే మగన్’ చిత్రానికి అఫీషియల్ రీమేక్. ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రంగానూ ప్రత్యేకతను సంతరించుకుంది . ఇక ఇదే సినిమా తమిళంలో సత్యరాజ్ హీరోగా ‘మక్కళ్ ఎన్ పక్కమ్’ గానూ, కన్నడలో ప్రభాకర్ హీరోగా ‘అతిరథ మహారథ’ గానూ, బాలీవుడ్ లో జితేంద్ర హీరోగా ‘కన్వర్ లాల్’ గానూ రీమేక్ అయి.. ఆయాభాషల్లోనూ ఘనవిజయం సాధించింది. అయితే ఇక్కడో విశేషమేంటంటే.. మోహన్ లాల్ ‘రాజావిండే మగన్‘ చిత్రానికి సిడ్నీ షెల్డన్ రచించిన ‘రేజ్ ఆఫ్ ఏంజిల్స్’ నవల ప్రేరణ కావడం కొసమెరుపు.