ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. దీని ప్రభావంతో మన దేశం లాక్ డౌన్ లో ఇరుక్కుంది. రాజు నుంచి పేదవరకూ అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. వ్యాపారాలు , ఉద్యోగాలు  బంద్. రవాణా బంద్. సినిమా హాళ్ళు బంద్. మన దేశం వివిధ రకాలుగా లాక్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో కూడా ఒక మలయాళ సినిమా తాపీగా షూటింగ్ జరుపుకుంది. ఆ సినిమా పేరు ‘ఆడుజీవితం’ (మేక జీవితం). బ్లెస్సీ దర్శకత్వంలో పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా నిజానికి జోర్డాన్ లో షూటింగ్ జరుపుతుండగా.. ప్రపంచంలోని కొన్నిదేశాలు లాక్ డౌన్ లో చిక్కుకున్నాయి. అక్కడి పరిస్థితి బాగోలేవని షూటింగ్ ఆపేయాలని అధికారులు చిత్రయూనిట్ కి గతంలోనే సూచించారు.

అయితే ఊహించని విధంగా.. అన్నీ టెస్టులు చేయించుకొని షూటింగ్ కొనసాగించారట ఈ టీమ్. ఇంకా ఓ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఎడారి ప్రాంతం కావడంతోనే షూటింగ్ చేయడం సాధ్యమైందని తెలుస్తుంది. ఎందుకంటే ఒంటరి ప్రదేశంలో ఎడారిలో శిబిరాలు నిర్మించుకొని కంటిన్యూ చేశారట. ఇంకా కేవలం ఆ సినిమా చిత్రబృందం మాత్రమే ఉండటం.. చుట్టూ పక్కల ఎవరు లేకపోవడం వీరికి ప్లస్ అయింది. మొదట్లో ఇండియాకి రావడానికి ప్రయత్నించినా విమానయానం నిలిపేయడంతో షూటింగ్ అయినా పూర్తి చేద్దామని భావించారట. ఆడుజీవితం అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది మలయాళంలో మోస్ట్ అవైటింగ్ సినిమా. అయితే లాక్ డౌన్ లో కూడా షూటింగ్ కంటిన్యూ చేసిన ఇండియన్ సినిమా ఇదొక్కటే అని సమాచారం.

 

Leave a comment

error: Content is protected !!