చిత్రం : ఏ1 ఎక్స్ ప్రెస్

నటీనటులు : సందీప్ కిష‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ తదితరులు.

సంగీతం : హిప్‌ హాప్‌ తమిళ

సినిమాటోగ్రఫీ : కెవిన్ రాజ్‌

ఎడిటింగ్‌ : చోటా కె. ప్ర‌సాద్‌

బ్యానర్ : వెంకటాద్రి టాకీస్

నిర్మాత : టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్‌ అగర్వాల్

దర్శకత్వం : డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను

విడుదల తేది : 05-03-2021

సందీప్ కిషన్ కొద్ది కాలంగా కెరీర్ పరంగా సరైన విజయాలు అనేవి చాలా తక్కువనే చెప్పాలి. నిను వీడని నీడను నేనేసినిమాతో నిర్మాతగా మారి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమా నిరాశ పరిచింది. తాజాగా తన 25వ సినిమాగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హాకి ఆట అంటూ స్పోర్ట్స్ నేపధ్యంలో సాగే ఈ సినిమా సందీప్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కేలా చేసిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథ : సందీప్ నాయుడు (సందీప్ కిషన్) సరదాగా తన మావయ్య ఊరు యానాం వస్తాడు. అక్కడ లావణ్య (లావణ్య త్రిపాఠి)ని తొలుత ఫోటోలో తర్వాత డైరెక్ట్ గా చూసి ఇష్టపడతాడు. డిస్ట్రిక్ట్ లెవల్ హాకీ ప్లేయర్ అయిన లావణ్య మరియు అకాడమీ కోచ్ (మురళీ శర్మ)లు తమ గ్రౌండ్ ను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు తెలుస్తుంది సందీప్ నాయుడు అందరూ అనుకుంటున్నట్లు ఆకతాయి కాదని, ఇంటర్నేషనల్ లెవల్ ప్లేయర్ మరియు అండర్ 21 ఇండియన్ టీం కెప్టెన్ అని తెలుసుకొంటారు. వీళ్ళందరూ కలిసి తమ గ్రౌండ్ ను ఫారిన్ కంపెనీకి అమ్మేయాలని మాస్టర్ ప్లాన్ వేసిన స్పొర్ట్స్ మినిస్టర్ రావు రమేశ్ (రావు రమేశ్)ను ఎలా ఎదుర్కొన్నారు? అనేది ఏ1 ఎక్స్ ప్రెస్కథాంశం.

 కథ విశ్లేషణ : యానాం లోకేషన్స్ తో సినిమా మొదలవుతుంది. అక్కడ ఉన్న చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌కి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి ఏడాది కనీసం ఇద్దరైనా జాతీయ జట్టుకు ఆ గ్రౌండ్ నుండి ఎంపికవుతుంటారు. హాకీ కోచ్‌ మురళీ (మురళీ శర్మ) అక్కడి  పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తుంటారు. చిట్టిబాబు గ్రౌండ్‌ అంటే కోచ్‌ మురళితో పాటు అక్కడి ప్రజలకు కూడా గుడితో సమానం. అలాంటి గ్రౌండ్‌పై  ఓ కంపెనీ కన్ను పడుతుంది. ఆ స్థలంలో మెడికల్‌ ల్యాబ్‌ని కట్టాలనుకుంటారు. ఇందుకోసం క్రీడాశాఖ మంత్రి రావు రమేశ్‌(రావు రమేశ్‌)కి లంచం ఇస్తారు కంపెనీ యజమానులు. దీంతో తన అధికారాన్ని ఉపయోగించిన మంత్రి ఆ క్లబ్‌ని అండర్‌ ఫర్ఫార్మింగ్‌ లిస్ట్‌లో వేస్తాడు. తమ గ్రౌండ్‌ దక్కించుకునే పనిలో కోచ్ మురళి నేషనల్‌ లెవల్‌ టోర్నమెంట్‌ గెలవాలి అని హాకి టీం ను ఉత్తేజ పరుస్తుంటాడు. ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంతలో హైదరాబాద్‌ నుంచి యానాం బంధువుల ఇంటికి వచ్చిన సందీప్‌(సందీప్‌ కిషన్‌) తొలి చూపులోనే హాకీ ప్లేయర్‌ లావణ్య(లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడిపోతాడు. ఆమెకు సహాయం చేసే క్రమంలో హాకీ ఆడతాడు. ఎలాంటి కోచింగ్‌ లేకుండా హాకీ గేమ్‌ని అద్భుతంగా ఆడిన సందీప్‌ని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అతని ప్లాష్‌బ్యాక్‌ విని షాకవుతారు. అసలు సందీప్‌ ఎవరు? అతను హాకీ గేమ్‌ని అంత అద్భుతంగా ఎలా ఆడాడు? చిట్టిబాబు గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కోచ్‌ మరళికి సందీప్‌ ఎలా సహాయపడ్డాడు? చివరకి చిట్టిబాబు గ్రౌండ్‌ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.

నటీనటుల పెర్ఫార్మెన్స్ : నటుడిగా సందీప్ లో పరిణితి కనిపించింది. చాన్నాళ్ల తర్వాత సెట్టిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాకి, క్యారెక్టర్ కి ఎంతవరకు అవసరమే అంతే ఎమోషన్ ను పండించాడు. ఫిజికల్ గా, ఆటిట్యూడ్ పరంగా, మ్యానరిజమ్స్ పరంగా ఒక పర్ఫెక్ట్ హాకీ ప్లేయర్ లా కనిపించాడు సందీప్.  లావణ్య త్రిపాఠి పాత్ర చాలా చిన్నది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్ కావడంతో ఆమెకు పెద్దగా నటించడానికి స్కోప్ కూడా లేదు. రావు రమేశ్ కి చాన్నాళ్ల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దొరికింది. పోసాని, మురళీ శర్మ, సత్య, మహేశ్ విట్టా, భూపాల్, అభిజిత్ లు తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు.

టెక్నిషియన్స్ పనితనం : కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, హిప్ హాప్ తమిళ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. ఒక స్పొర్ట్స్ డ్రామా ఫీల్ ను తన కెమెరా ఫ్రెమింగ్స్ తో తీసుకొచ్చాడు కెవిన్. ఇక హిప్ హాప్ తమిళ మ్యూజిక్ & బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ముఖ్యంగా ప్రీఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే సీటు సిరగదాఅని మంగ్లీ-ప్రణవ్ చాగంటి పాడిన పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఛోటా కె.ప్రసాద్ ఎక్స్ పీరియన్స్ & షార్ప్ ఎడిటింగ్ స్కిల్ సినిమాలో ఎక్కడా ల్యాగ్ లేకుండా చేసింది. సినిమా కథ బాగానే కథనంలో చిన్నచిన్న లోపాలు సినిమాకు మైనస్ గా మారాయి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బెటర్ గా ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది.  

రేటింగ్ : 2.5/5

 

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

Leave a comment

error: Content is protected !!