బన్నీ.. బాడీలో స్ప్రింగ్‌లున్నట్టు డాన్స్ చేసే స్టార్. తాత వారసత్వంగా కామెడీ అబ్బింది. డైలాగ్ చెప్పడంలో ఈజ్, తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఇవన్నీ కలగలిపి స్టైలిష్ స్టార్ గా యూత్‌లో నిలిపింది. బన్నీ కెరియర్ గంగోత్రితో స్టార్టయినా బ్రేక్ ఇచ్చింది ఆర్య. ఈ సినిమాకు ముందు మరో కాంబినేషన్ సెట్ అయి వుంటే ఆ కాంబో మూవీనే బన్నీకి బ్రేక్ ఇచ్చుండేది. ఇంతకీ ఏంటా సినిమా.
విషయంలోకి వెళ్తే.. వైవిఎస్ చౌదరి ఒక బ్యూటిఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న లవ్‌స్టోరీ తీయాలని ప్లాన్ చేసాడు. అంతకుముందు వైవిఎస్ తీసిన సీతయ్య సక్సెస్ కావడంతో స్టార్ హీరోలు సైతం ఆయన డైరెక్షన్‌లో చేసే అవకాశం వుంది. కానీ వైవిఎస్ మాత్రం కొత్తవాళ్లతో తీయాలనుకున్నాడట. పాతాళభైరవి లాంటి లవ్‌స్టోరీ, ఇప్పటి నేటివిటీకి తగ్గట్టు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కావాలి. అదీ వైవిఎస్ చౌదరి మనసులో ఉన్న ఆలోచన. అనుకున్నట్టుగా స్టోరీ రెడీ చేసాడు. పక్కా మాస్ అబ్బాయి, సూపర్ రిచ్ అమ్మాయి మధ్య లవ్ స్టోరీ. ఆ సినిమాకు బన్నీ అయితే బాగుంటాడు అనుకున్నాడు. గంగోత్రి హిట్ తో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు బన్నీ. ఖచ్చితంగా బన్నీ కి బ్రేక్ ఇచ్చే మూవీ అవుతుందనేది వైవిఎస్ నమ్మకం. ఆ మూవీనే దేవదాస్. కానీ బన్నీఈ ప్రాజెక్ట్‌లో ఓ రీజన్‌తో చేయలేకపోయాడు.
పక్కా హైదరాబాదీ కుర్రాడు తన లవర్ కోసం అమెరికాకు వెళ్లి ఆమె తండ్రితో ఛాలెంజ్ చేసి మరీ లవ్ ను గెలిపించుకుంటాడు. బన్నీలో వున్న ఈజ్ నచ్చి అతనైతే కరెక్ట్ అని అల్లు అరవింద్‌ను అడిగాడట వైవిఎస్. కానీ అప్పటికే ఆర్యకు డేట్స్ ఇచ్చాడు బన్నీ. కథ నచ్చడంతో ఆర్య తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామనే ప్రపోజల్ అల్లు వారి తరుపునుంచి వచ్చిందట. కానీ ఇంత మంచి సబ్జెక్ట్‌ను లేట్ చేయడం ఇష్టం లేక కొత్తవాళ్లతో ట్రై చేసాడట వైవిఎస్. అదే టైమ్‌లో తమిళ మూవీ రీమేక్ రైట్స్ కొని తెలుగులో చేయడానికి వైవిఎస్‌ను పిలిపించాడు స్రవంతి రవికిశోర్. అతని ఫోన్‌లో రామ్ వీడియో క్లిప్పింగ్ చూసి రామ్‌ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. అలా రామ్‌కు ఫస్ట్ మూవీతే బ్రేక్ బ్లాక్‌బస్టర్ హిట్ వచ్చింది. అటు ఆర్యతో బన్నీకి బ్రేక్ వచ్చింది.