Dunki movie : కింగ్ ఖాన్ షారూఖ్, బ్రిలియంట్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబో లో వచ్చిన మొట్ట మొదటి సినిమా డంకీ. ఈ సినిమా ప్రభాస్ సలార్ విడుదలకు ఒక రోజు ముందు థియేటర్స్ లో విడుదలైంది . బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 470 కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటి ఈ సినిమాకి ఒక అరుదైన గౌరవం దక్కింది.

షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (SIFF) లో ఈ సినిమా ప్రదర్శనకు హాజరు కావాల్సిందిగా దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీకి ఆహ్వానం అందడంతో ఈ సినిమా మళ్లీ చర్చనీయాంశమైంది. ఇది తమ టీమ్‌కి దక్కిన గౌరవమని భావిస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా చైనాలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో హిరానీ ఈ చిత్రానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అయితే షారుఖ్ అతనితో పాటు వెళ్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై గౌరీ ఖాన్, జియో స్టూడియోస్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్‌పై రాజ్‌కుమార్ హిరానీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Leave a comment

error: Content is protected !!