చిత్రం : ఏ ’(ఎడి ఇన్ఫీనిటం)’

నటీనటులు : నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని, రంగధం తదితరులు

సంగీతం : విజయ్ కురకుల

ఎడిటింగ్‌ : ఆనంద్ పవన్, మనికందన్

సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కె బంగారి

బ్యానర్ : అవంతిక ప్రొడక్షన్స్

నిర్మాత : గీత మిన్సాల

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : యుగంధర్ ముని

విడుదల తేది : 05-03-2021

ఏ ’(ఎడి ఇన్ఫీనిటం)’ మూవీ టీజర్ ను ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ద్వారా విడుదల చేసి సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించిన మూవీ. టీజర్ లో ట్రైలర్ లో సినిమా ఒక జోనర్ కి చెందింది అని గెస్ చేసే అవకాశం లేకుండా క్రిస్పిగా కట్ చేసి అసలు ఈ ఏ ’(ఎడి ఇన్ఫీనిటం)’ సినిమా ఏ జోనర్ లోకి వస్తుంది అనే క్యూరియాసిటిని కలిగించింది. మొత్తానికి సినిమా పోస్టర్స్ & టైటిల్ లోగోలో కనిపించిన ‘బ్రెయిన్’ (మెదడు) ద్వారా ఇది ఒక సైన్స్ కథాంశం అని ఆడియన్స్ జడ్జ్  చేయొచ్చు. అసలు సినిమా కథేంటి..? టైటిల్ ఏ ’(ఎడి ఇన్ఫీనిటం)’ లో ‘ఏ’ అంటే ఏమిటి..? అనేది రివ్యూ లో చూద్దాం…

కథ : నితిన్ ప్రసన్న(సంజీవ్), ప్రీతి అస్రాని (పల్లవి) ఒక మిడిల్ క్లాస్ కుటుంబం వీరికి ఒక పాప పేరు అమృత. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో సంజీవ్ క్యాష్ కౌంటర్ లోను పల్లవి స్టాఫ్ నర్స్ గా పనిచేస్తూ హ్యాపీగా జీవితం సాగిపోతుంది. వీరిది ప్రేమ వివాహం. బోయిన్ పల్లి ఫుట్పాత్ పై ఒక 6 ఏళ్ల పాపను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేస్తుంటాడు. ఈ కేస్ ను కొన్ని రోజుల్లో రిటైర్ అవ్వపోతున్న రంగధం (విష్ణు) కేస్ ను చేధించే దిశగా కేస్  టేకప్ చేస్తాడు. అసలు ఆ కిడ్నాప్ ఎందుకు జరిగింది..? ఎవరు చేశారు..? సంజీవ్, పల్లవి వాళ్ళ పరిచయం ఎలా ఏర్పడింది..? ఆ కేస్ లో ఎటువంటి నిజాలు భయట పడ్డాయి..? పోస్టర్స్ లో చూపినట్లు హీరోలోని ఆ మూడు షేడ్స్ వెనుక కథేంటి అనేది అనే ఆసక్తికరమైన అంశాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

కథ విశ్లేషణ : ఒక తుఫాన్ ప్రమాదంలో పడిపోయిన సంజీవ్ ను అంబులెన్స్ లో ఒక ఆస్పత్రికి చేరుస్తారు. తనకు స్పృహ రాగానే అక్కడ నర్స్ గా పనిచేస్తున్న పల్లవితో పరిచయం, ప్రేమ, వివాహం ఇలా జరిగిపోతుంది. అప్పుడప్పుడు సంజీవ్ కు ఒక చిన్న పిల్లతలను కత్తితో కోస్తున్నట్లు  కల వస్తూ ఉంటుంది. తనకు గుండుతో ఉన్న మనషులను చూసిన తను స్పృహ తప్పిపోతుంటాడు. తనకు తన గతం కూడా గుర్తుండదు. కాని తన గతం గురించి తెలుసుకోవాలని జర్నలిస్ట్ అయిన తన స్నేహితుడుతో కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉండగా…

తన పోలికలతో ఉన్న అశ్వధామ అనే పేరుతో ఒక ఫోటో ఒక పుస్తకంలో దొరుకుంది. ఆ అశ్వధామకి సంజీవ్ కి గల సంబంధం..? అశ్వధామ గతం ఏమిటి..? ఆ క్రమంలో తన పోలికలతో ఉన్న అర్జున్ తన కూతురుని కిడ్నాప్ చేస్తాడు..? ఆ కిద్నాప్స్ & ఆ బ్రెయిన్ పై పరిశోధనలు ఏమిటి? అసలు సంజీవ్ అశ్వధామ అర్జున్ వీరికి గల రిలేషన్ షిప్ ఏంటి అనేది మిగిలిన కథ.!?

నటీనటుల పెర్ఫార్మెన్స్ : ముఖ్యంగా ఈ చిత్రంలోని నటినటుల పెర్ఫార్మెన్స్ గురుంచి చెప్పుకోవాలి. కొత్త హీరో నితిన్ ప్రసన్న (కేరళ) పెర్ఫార్మెన్స్  ను గురుంచి మాట్లాడుకోవాలి. సినిమాలో మధ్యతరగతి భర్తగా ఉద్యోగం చేస్తూ తన కున్న భార్య కూతురు గల చిన్న కుటుంబాన్ని ప్రేమిస్తూ… మధ్యలో తనకు కల వచ్చిన ప్రతిసారి ముఖంలో చూపిన హావభావాలు, ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే అశ్వధామ రోల్ & సైంటిస్ట్ అర్జున్ గా చేసిన పాత్రకు తానే స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్ప్పుకోవడం చెప్పుకోదగ్గ విషయం. ఇక హీరొయిన్ గా చేసిన ‘మళ్ళీ రావా..!’ ఫేం ప్రీతి అస్రాని మధ్యతరగతి కుటుంబంలోని భార్యగా, ఉద్యోగం చేసే నర్స్ గా తను చేసిన పాత్ర చాలా బాగుంది. కేవలం పాటలకే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో చక్కగా నటించింది. సినిమాలోపోలిస్ రోల్ చేసిన రంగధం తన పరిది మేరా చక్కని నటనను కనబరిచారు.

టెక్నిషియన్స్ పనితనం : సైన్స్ కాన్సెప్ట్ ఉన్న సినిమాకి కొత్త హీరోను ఎన్నుకుని సాహసం చేసిన దర్శకుడు యుగంధర్ ముని ని అభినందించాలి. హీరో హీరోయిన్ ఇతర ఆర్టిస్టుల నుండి మంచి నటనను ప్రదర్శించేలా చేశారు. అనంత్ శ్రీ రాం రాసిన పాటలు సినిమా మొదటి భాగంలో బ్యాగ్రౌండ్ గా వస్తాయి. సన్నివేశాలకు తగ్గట్లు విజయ్ కురకుల అందించిన సంగీతం బావుంది. ప్రవీణ్ కె బంగారి చేసిన సినిమాటోగ్రఫీ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి బాగా హెల్ప్ అయ్యింది. అవంతిక ప్రొడక్షన్స్ పై నిర్మాత గీత మిన్సాల మంచి సినిమాను అందించారు.

రేటింగ్ : 2.25/5

Leave a comment

error: Content is protected !!