తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా.. ఇతర ఓటీటీలకు గట్టి పోటీనిచ్చే దిశలో కొత్త కొత్త సినిమాల్ని స్ట్రీమింగ్ చేస్తోంది. రన్, కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ లాంటి సినిమాలతో లాక్ డౌన్ లో ఇంటి వద్దనే ఉన్న ప్రేక్షకులకు మంచి వినోదం అందించింది. ఈ నేపథ్యంలో ఆహా.. మరో ఆసక్తికరమైన సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. సినిమా పేరు జోహార్. ఆగష్టు 14వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. పొలిటిక్ బ్యాక్ డ్రాప్ లో భావోద్వేగాలతో కూడిన నాలుగు కథల్ని ఆంథాలజీ ఫార్మేట్ లో తెరకెక్కించింది. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది.

జీవితాలనే కథగా చెప్తా వినండి అంటూ స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టైనా సరే మా నాన్న విగ్రహం కట్టిస్తాను.. లాంటి డైలాగ్స్ తో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే భావోద్వేగాల కలయికలో పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కిందని అర్థం అవుతోంది. జోహార్ చిత్రం ద్వారా తేజ మార్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ధర్మ సూర్య పిక్చర్స్ బ్యానర్ పై భాను సందీప్ మార్ని ఈ సినిమాను నిర్మించారు. నైనా గంగూలీ,  ఎస్తేర్ అనిల్ (దృశ్యంలో వెంకటేశ్ చిన్నకూతురు ),  చైతన్య కృష్ణ, అంకిత్ కొయ్యా,  శుభలేఖ సుధాకర్, రోహిణి,  నీరజ ప్రధాన పాత్రల్లో నటించారు.

ట్రైలర్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=8vwzDyVcPck&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!