హ్యాండ్సమ్ ఫేస్ .. మ్యాన్లీ లుక్స్ .. స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ .. స్పష్టంగా ఉచ్ఛరించే లాంగ్వేజ్ .. అతడి అసెట్స్ . మలయాళీ కుర్రోడు అయినప్పటికీ…. తన సొంత గడ్డకే పరిమితమవకుండా..  తమిళ, తెలుగు భాషల్లో కూడా నటుడిగా సత్తా చాటుకున్నాడు. హీరోగా శభాష్ అనిపించుకున్నాడు. అతడి పేరు దుల్కర్ సల్మాన్. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టికి ఒక్కగానొక్క కొడుకు. అయినప్పటికీ తండ్రి తాలూక ఇమేజ్ తనమీద పడుకుండా.. హీరోగా ఎదిగేందుకు తగిన ప్రణాళికలు తనకు తానే రచించుకొని తన స్వయం శక్తితో  దక్షిణాదిన స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ లో ఛోటా మెగాస్టార్. దక్షిణాదిన మంచి క్రేజ్ ఉన్న స్టార్.

తండ్రి మెగాస్టార్ అవ్వడంతో స్వతహాగానే చిన్నప్పటినుంచి  నటనమీద మక్కువ పెంచుకున్నాడు దుల్కర్ సల్మాన్. చిన్నతనం నుంచీ తండ్రి సినిమాలు చూస్తూ పెరిగాడు. కానీ సినిమాల్లో హీరోగా చేయాలనే ఐడియా ఇంకా అతడికి రాలేదు. అలాంటి సమయంలోనే దర్శకుడు శ్యామ్ ప్రసాద్ .. రీతూ అనే సినిమాలో ఒక పాత్రలో నటించేందుకు దుల్కర్ కు అవకాశమిచ్చారు. అలాగే.. తమిళ దర్శకుడు లింగుసామి తన తొలి మలయాళ చిత్రంతో దుల్కర్ ను హీరోని చేయాలనుకున్నాడు. అయితే ఆ టైమ్ లో దుల్కర్ . . తనకింకా నటనానుభవం లేకపోవడంతో.. ఆ పాత్రల్ని సున్నితంగా తిరస్కరించి.. సినిమాలకు సంబంధించిన స్వల్ప కోర్స్ లో చేరి.. దాని మీద పట్టు సంపాదించుకున్నడు. 2012 లో శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో ‘సెకండ్ షో’ అనే సినిమాతో హీరోగా మాలీవుడ్ రంగ ప్రవేశం చేశాడు దుల్కర్. ఆ సినిమా సూపర్ హిట్టు. ఆ తర్వాత వచ్చిన ఉస్తాద్ హోటల్ సైతం సూపర్ హిట్టు . ఆపై 6 సినిమాలు వరుసగా హిట్టయ్యాయి. అలాగే.. తమిళంలో ‘వాయుముడి పేసువో’ సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మహానటితో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా దక్షిణాదిన మూడు భాషల్లో నూ వైవిధ్యమైన చిత్రాలు చేసి .. మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం తెలుగు లో వైజయంతి బ్యానర్ లో హనురాఘవపూడి డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నాడు.  నేడు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే దుల్కర్ సల్మాన్ ….

Leave a comment

error: Content is protected !!