అతడు పెద్ద అందగాడు కాదు. ఆరడుగుల ఆజానుబాహుడూకాదు. ఆకర్షించే వర్ణమూ లేదు. ఆకట్టుకొనే ముఖఛాయ లేదు. కానీ దక్షిణాది ప్రేక్షకుల అభిమానానికి మాత్రం పాత్రుడు అయ్యాడు. తన నటనతో ఈ తరం కుర్రోళ్ళకి సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా మారాడు. పేరు ధనుష్. తమిళనాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో ఒకడు. తలైవా రజనీకాంత్ అల్లుడిగా .. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలగని రీతిలో ఇటు .. తన కుటుంబంలోనూ, అటు సినీ ప్రపంచంలోనూ రారాజుగా వెలుగొందుతూ వైవిధ్యమైన కథల్ని ఎంపికచేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

తమిళ సినీరంగంలో ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు కస్తూరి రాజా తనయుడిగా సినీ రంగానికి పరిచయమైన ధనుష్ ను .. దర్శకుడు, అన్న అయిన సెల్వరాఘవన్ మంచి సపోర్ట్ గా నిలిచి అతడి స్టార్ డమ్ కు ప్రధాన కారణమయ్యాడు. తన తండ్రి, అన్న దర్వకత్వంలో నటించి అందులోని మెలకువళు తెలుసుకున్నాడు. ఆపై మంచి మంచి సినిమాల్లో నటించి సత్తా చాటుకున్నాడు. ధనుష్ ముందు నుంచీ ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకే మొగ్గుచూపేవాడు. దాని కారణంగా అతడికి ఆడుకళాం చిత్రంతో మొదటి సారిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్ లో దాదాపు 44 చిత్రాల్లో నటించి .. అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. నేడు ధనుష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీవాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే ధనుష్…

Leave a comment

error: Content is protected !!