పిట్టకొంచెం.. కూత ఘనం అన్నట్టు… చాలా చిన్న వయసే అయినా.. కెమేరాను ఫేస్ చేయడంలో ఏమాత్రం భయపడడు అతడు . యాక్టింగ్ లో ఎలాంటి తడబాటూ ఉండదు. డైలాగ్స్ పలకడంలో ఎవరికీ తీసిపోడు. ఫైట్స్ , డ్యాన్స్ చేయడంలో చాలా ఉత్సాహం చూపిస్తాడు. అతడి పేరు ఆకాష్ పూరీ. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడిగా .. చాలా చిన్నవయసులోనే కెమేరా ముందుకు వచ్చిన అతడు.. స్టార్ హీరోల చిన్నప్పటి పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నాడు. ఆ పై హీరోగా మారాడు.  ఇప్పుడు పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ…  తనకో సెపరేట్ రూట్ ఏర్పరుచుకుంటున్నాడు.

రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుతలో .. అతడి చిన్నతనంలోని పాత్ర పోషించి .. డెబ్యూ మూవీతోనే ప్రశంసలందుకున్నాడు ఆకాష్. ఆ తర్వాత ప్రభాస్ బుజ్జిగాడులో సైతం చైల్డ్ హుడ్ కేరక్టర్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత లోటస్ పాండ్ అనే ఇంగ్లీష్ మూవీలోనూ నటించి మెప్పించాడు. ఆంధ్రాపోరీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మెహబూబాలో కూడా హీరోగా మెరిసాడు. ఇప్పుడు రొమాంటిక్ అనే టీనేజ్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. తన తండ్రి పై ఏమాత్రం ఆధారపడకుండా.. తనకో ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకొనే పనిలో ఉన్నాడు ఆకాష్ .నేడు అతడి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆ చిచ్చరపిడుగు కి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే ఆకాష్ పూరీ

 

Leave a comment

error: Content is protected !!