తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘ఆకాశం నీహద్దురా’ . గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ నిజానికి ఈ సమ్మర్ లో విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మలయాళ క్రేజీ హీరోయిన్ అపర్ణా బాలమురళి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఆ మధ్య విడుదల కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక  ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇప్పటివరకూ లిరికల్ సాంగ్స్ ను విడుదల చేసుకుంటూ వచ్చిన చిత్ర బృందం తాజా గా ఈ సినిమాలోని ఒక పాట వీడియో ప్రోమోను విడుదల చేశారు. కాటుక కనులే.. . అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భాస్కర భట్ల రాసిన ఈ పాటను గురులో ఓ సక్కనోడా పాట పాడి మెప్పించిన ధీ పాడడం విశేషం. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ పాట జనంలోకి చాలా వేగంగా దూసుకుపోయింది. ఇక ఈ పాటలో  కథానాయిక అపర్ణ బాలమురళి, కథానాయకుడు  సూర్య మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటు అయింది. ఈ రోజు సూర్య పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ పాట కలర్ ఫుల్ విజువల్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రోమో సాంగ్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=-B_BXrl9iv4&feature=youtu.be

 

 

Leave a comment

error: Content is protected !!