Shopping Cart 0 items - $0.00 0

నాగార్జున ‘సూపర్’ చిత్రానికి 15 ఏళ్ళు

అక్కినేని నాగార్జున సినీ కెరీర్ లో స్టైలిష్ యాక్షన్ మూవీ సూపర్ . డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా 2005 లో విడుదలైంది. సరిగ్గా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా తో అందాల అనుష్క శెట్టి టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఇంకా.. సోనూ సూద్, అయిషా టాకియా, షియాజీ షిండే, ఆలీ, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇటాలియన్ జాబ్ హాలీవుడ్ మూవీ ప్రేరణతో తెరకెక్కిన ఈ సినిమాకథ  హైటెక్ రోబరీ నేపథ్యంలో సాగుతుంది. ఆ క్రమంలో ఇద్దరు స్నేహితుల మధ్య విబేధాలు ఏర్పడతాయి. దాని కారణంగా ఒకరి చెల్లెలు చనిపోతుంది. దాంతో ఇద్దరి మధ్య మరింత అగాథం ఏర్పడుతుంది. చివరికి నిజం తెలుసుకున్న ఆ స్నేహితులు ఒకటిగా కలవడంతో కథ సుఖాంతమవుతుంది.

అన్నపూర్ణ బ్యానర్ పై నాగ్ సొంతంగా నిర్మించిన ఈ సినిమా అంత గొప్పగా ఆడకపోయినా పర్వాలేదనిపించుకుంది. సందీప్ చౌతా అందించిన సంగీతం  అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. పూరీ స్టైలాఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆకట్టుకుంటాయి.

Leave a comment

error: Content is protected !!