Shopping Cart 0 items - $0.00 0

బాలకృష్ణ ‘గొప్పింటి అల్లుడు’ చిత్రానికి 20 ఏళ్ళు

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన కామెడీ ఎంటర్ టైనర్స్ లో ‘గొప్పింటి అల్లుడు’ ఒకటి. బాలయ్య సొంత బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై కామెడీ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2000 లో విడుదలైంది. సరిగ్గా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా లో సిమ్రాన్ కథానాయికగా నటించింది. కాగా.. కైకాల సత్యనారాయణ, యస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంఘవి, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, సాధిక ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

తండ్రి పోరు పడలేక విదేశాలకు వెళ్లిపోయిన హీరో.. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే తన తండ్రిని పెళ్ళికి ఒప్పించేందుకు హీరో ఒక నాటకమాడతాడు. చివరికి హీరో, హీరోయిన్స్ తమ కుటుంబసభ్యుల అనుమతితో ఎలా పెళ్ళి చేసుకుంటారు అన్నదే మిగతా కథ. నిజానికి ఈ సినిమా గోవింద నటించిన సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ హీరో నెం. 1 కి రీమేక్ వెర్షన్. డేవిడ్ ధావన్ తెరకెక్కించిన ఈ సినిమాను ఇవివి తనదైన స్టైల్లో బాలయ్యతో ఈ సినిమాను రీమేక్ చేశారు. ఇక కోటి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని బాగా అలరించాయి.

 

Leave a comment

error: Content is protected !!