సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ అండ్ సెంటిమెంట్ చిత్రం ‘మాయదారి కృష్ణుడు’. దేవర్ ఫిల్మ్స్ పతాకంపై సి.దండాయుధపాణి నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు ఆర్.త్యాగరాజన్. 1980లో విడుదలైన ఈ సినిమా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను తమిళ వెర్షన్ తో పాటు సైమల్ టేనియస్ గా తెరకెక్కించారు. రతి అగ్నిహోత్రి కథానాయికగా నటించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య, శ్రీధర్, సుజాత, రమాప్రభ, కె.వి.చలం,కె.కె.శర్మ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా రెండు భాషల్లోనూ సూపర్ హిట్టైంది.

చనిపోయిన ఒక నిజాయితీ పరుడైన పోలీసాఫీసర్ తన అన్న అని తెలుసుకున్న కృష్ణ.. అతడ్ని చంపిన వారిని కనిపెట్టే క్రమంలో .. తనే ఆ పోలీసాఫీసర్ గా అతడి గ్రామంలోకి అడుగుపెడతాడు. దాంతో పాటు తన వదిన, పిల్లల్ని కంటికిరెప్పలా కాపాడుకుంటాడు. ఆ క్రమంలో ఆ ఊరి పెద్ద మనిషి సర్వారాయుడు ఆగడాలకు అడ్డు కట్ట వేసి.. తన అన్న ను చంపిన అతడిమీద కృష్ణ  పగతీర్చుకోవడమే ఈ సినిమా కథ. అన్నదమ్ములుగా రజనీకాంత్, శ్రీధర్ నటించగా.. శ్రీధర్ భార్యగా సుజాత నటించింది. ఇళయరాజా సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానే మెప్పించాయి. ‘అన్బుక్కు నాన్ అడిమై’ గా తమిళంలోనూ విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్టవడం విశేషం.

 

Leave a comment

error: Content is protected !!