చక్రాల్లాంటి కళ్ళు.. చూపుతిప్పుకోలేని అందం.. పిసరంత చెలాకీ తనం, రవ్వంత కొంటెతనం కలగలిసిన చిలిపి చిన్నది . ఆమె చిరునవ్వుకు చిత్తైపోతారు ప్రేక్షకులు. ఆమె శరీర లావణ్యానికి మత్తెక్కిపోతారు అభిమానులు. పేరు ప్రియాంకా చోప్రా. బాలీవుడ్ తెరకు అందం అద్దిన అప్సరస ఆమె. ఒక్క నటిగానే కాదు, గాయని, నిర్మాత, మానవతావదిగా బాహుముఖ ప్రజ్ఞశాలి అనిపించుకుంది.
బిహార్‌లోని జెంషెడ్‌పూర్‌లో జన్మించింది ప్రియాంక. తాను కూడా సైన్యంలో చేరాలనే ఉద్దేశంతో ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరింది. కానీ సినిమాల్లో నటించే అవకాశాలు రావడంతో మనసంతా వెండితెరపైకి మళ్లింది. తొలుత ‘తమిళన్’ అనే చిత్రంతో అరంగేట్రం చేసింది. అందులో ఒక పాట కూడా పాడింది. ఆ తరువాత సన్నిడియోల్‌తో ‘ది లవ్‌స్టోరీ: ఆఫ్ ది స్పై’తో బాలీవుడ్‌కి పరిచయమైంది. కెరీర్ మొదట్లో అడుగులు తడబడినా, ‘ఐత్రాజ్’ సినిమాకు ఉత్తమ నటిగా ప్రశంసలు అందుకుంది. ఆపై అనేక అవార్డులు ప్రియాంకను వరించాయి. ఇక భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘పద్మశ్రీ’ అవార్డును ప్రియాంకకు అందించింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలో ఒకరిగా ‘ఫోర్బ్స్’ జాబితాలో స్థానం సంపాదించింది. బాలీవుడ్ కథానాయకులైన హృతిక్‌రోషన్‌తో కలిసి ‘క్రిష్’, క్రిష్ సిక్వెల్ చిత్రాల్లో, షారుఖ్‌తో ‘డాన్’, ‘డాన్2’, అభిషేక్ బచ్చన్, రితేష్దేశ్ముఖ్లతో ‘దోస్తానా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. తెలుగులో ‘అపురూపం’ చిత్రంలో మధుకర్, ప్రసన్నలతో కలిసి నటించింది. ఇక ఆ మధ్య వచ్చిన ‘తుఫాన్’లో రామ్‌చరణ్‌తో కలిసి నటించింది. మహిళా ప్రాధాన్యంతో వచ్చిన బాక్సర్ మేరీకోమ్ హ్మంగేట్ బయోపిక్ ‘మేరీకొమ్’, ప్రకాష్ ఝా దర్శకత్వంలో వచ్చిన ‘గంగాజల్’లో మెప్పించింది. మధ్యలో చారిత్రక చిత్రం ‘బాజీరావు మస్తానీ’లాంటి వైవిధ్యమైన చిత్రాల్లోనూ నటించింది. ఇక టెలివిజన్ సిరీస్‌లోకి వస్తే మొదటి అక్షయ్‌కుమార్ యాంకర్‌గా ‘కత్రోం కే కిలాడి’లో చేసింది. అదే అనుభవంతో అమెరికన్ టెలివిజన్ టీవి షో ‘క్వాంటికో’లాంటి ప్రఖ్యాత టీవి సిరీస్‌లో నటించి ప్రపంప వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. సమాజసేవలోనూ తీసిపోలేదు. యునిసెఫ్ రాయబారిగా, సామాజిక కార్యకర్తగా ‘ప్రియాంక చోప్రా ఫౌండేషన్’ పేరుతో గ్రామీణ పేదలకు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తూ తనలోని మానవతను చాటుకొంటుంది. నేడు ప్రియాంకా చోప్రా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే ప్రియాంకా చోప్రా