Shopping Cart 0 items - $0.00 0

కృష్ణ ‘సిరిమల్లె నవ్వింది’ చిత్రానికి 40 ఏళ్లు

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్నో కుటుంబ కథాచిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ జాబితాలో ఓ అందమైన చిత్రం ‘సిరిమల్లె నవ్వింది’. రవికళా మందిర్ బ్యానర్ పై ఆదుర్తి భాస్కర్, యం.యస్ .ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి దర్శకురాలు విజయనిర్మల.ఈ సినిమాకి  ఆదివిష్ణు కథ, ఆదుర్తి సుబ్బారావు స్ర్కీన్ ప్లే, జంధ్యాల సంభాషణలు అందించడం విశేషం. సుజాత కథానాయికగా నటించగా.. నాగభూషణం, చంద్రమోహన్, రాజబాబు, మోహన్ బాబు, రావికొండలరావు, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఆపదలో ఉన్న ఒక అందమైన అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమించి.. చివరికి ఆమె సమస్యకి పరిష్కార మార్గం చూపి..కథానాయకుడు ఆమెను తన దాన్ని చేసుకోవడమే చిత్ర కథ. కె.వి.మహదేవన్ సంగీతం సారధ్యంలోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఎగిరొచ్చిన ఓ చిలకమ్మ, ఒక పువ్వు పూచించి పాటలు వినవిందుగా ఉంటాయి. అప్పట్లో శతదినోత్సవం జరుపుకున్న  ‘సిరిమల్లె నవ్వింది’ చిత్రం కృష్ణ కు ఎంతో ప్రత్యేకమైన చిత్రం.  

Leave a comment

error: Content is protected !!