ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖ వ్యక్తుల బయోపిక్స్ ట్రెండ్ గా మారింది. గతంలో అన్నిరంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకున్న పెర్సనాలిటీస్ బయోపిక్స్ అన్నీ దాదాపుగా విజయం సాధించాయి.  ఈ జాబితాలోకి ఇప్పుడు మరో బయోపిక్ వచ్చి చేరింది. గణిత శాస్త్రంలో అపారమైన మేథస్సును కనబరిచి .. హ్యూమన్ కంప్యూటర్ గా పేరు తెచ్చుకున్న శకుంతలాదేవి జీవిత కథ త్వరలో సినిమాగా రాబోతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ విద్యాబాలన్ .. శకుంతలాదేవి గా టైటిల్ రోల్ ప్లే చేస్తోంది.

శకుంతలా దేవి పేరుతో  తెరకెక్కిన ఈ ఈ బయోపిక్  ఈ నెల 31న డిజిటల్ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో శకుంతలా దేవి పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయారు. శకుంతలా దేవిగా డిఫరెంట్ గెటప్స్‌లో విద్యాబాలన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అనూ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ట్రైలర్ వీక్షించడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=8HA1HRufYso&feature=youtu.be

Leave a comment

error: Content is protected !!