కైపెక్కించే రూపం.. మత్తెక్కించే దేహం.. మైమరపించే లావణ్యం. ఆమె చిలిపిగా ఓ లుక్కేస్తే చిత్తైపోవాల్సిందే. చిరునవ్వు విసిరితే మంత్ర ముగ్ధులవ్వాల్సిందే. పేరు కత్రినా కైఫ్. అందం, అభినయం తో రెండు వైపులా పదును కలిగిన నైఫ్. హిందీ, తెలుగు, మళయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించింది. జాతీయ, అంతర్జాతీయ, ఫిలింఫేర్ అవార్డులను సాధించింది. తెలుగు ప్రేక్షకుల వరకూ ఆమె అందాల మల్లీశ్వరి.
14 ఏళ్ల వయసులోనే హవాయిలో అందాల పోటీల్లో పాల్గొంది కత్రినా కైఫ్ . గేమ్ షోలతో పాటు సల్మాన్‌ఖాన్ నిర్వహించిన ‘బీయింగ్ హ్యూమన్’ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. వరల్డ్ సెక్సీయస్ట్ ఉమన్ గా గుర్తింపు తెచ్చుకొంది. హిందీలో ‘బూమ్’ ఆమె తొలి బాలీవుడ్ చిత్రం. అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించింది. ఆ తరువాత ‘సర్కార్’, ‘ధూమ్ 3’ చిత్రాల్లో నటించింది. మళయాళంలో ‘బలరామ్ వర్సెస్ తారాదాస్’లో ‘సుప్రియ’ పాత్రలో కనిపించింది. తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్‌ల సరసన ‘మల్లీశ్వరి’, అల్లరి పిడుగు’ చిత్రాల్లో నటించింది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘జీరో’లాంటి చిత్రాల్లో సందడి చేసింది. నమస్తే లండన్ (2007) చిత్రం కత్రీనా భవిష్యత్తును మలుపు తిప్పింది. హిందీలో విడుదలైన ‘న్యూయార్క్’ చిత్రంలో నటనకు గాను ‘ఫిలింఫేర్’ అవార్డుకు నామినేటైంది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ‘స్టైల్ దివా ఆఫ్ ద ఇయర్’ అవార్డు సహా మొత్తం 35 అవార్డులు ఆమె సొంతం. అత్యధిక పారితోషికాన్ని ఆందుకున్న నటిగా గుర్తింపు పొందింది. నేడు కత్రినా కైఫ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే కత్రినా కైఫ్ …