ఇటు మాస్ , అటు క్లాస్ చిత్రాలు తీయగల దర్శక సవ్యసాచి ఆయన. అగ్ర కథానాయకులతోనూ, సాధారణ కథానాయకులతోనూ సినిమాలు తీసి హిట్టు కొట్టిన గట్టి దర్శకుడు.  ఆయన ప్రత్యేకత ఏంటంటే.. తాను దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ దాదాపు రీమేక్సే అవడం. ఒకటో రెండో మాత్రమే స్ట్రైట్ చిత్రాలుంటాయి. అయితేనేం.. ఒరిజినల్ వెర్షన్ కన్నా చాలా బెటర్ గా ఆయన రీమేక్ వెర్షన్స్ తెరకెక్కించారు. ఆయన పేరు రవిరాజా పినిశెట్టి.  ఆయన సన్నిహితులు  ఆయన్ను రీమేక్ రాజా అంటారు. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆయన్ను దర్శకరాజా అంటారు.

1984 లో వీరభద్రుడు  చిత్రంతో రవిరాజా టాలీవుడ్ లో దర్శక ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. కార్తిక్, మాదాల రంగారావు నటించిన ఆ సినిమా కాస్తంత నిరాశపరిచినా.. వెంటనే ఆయనకి చిరంజీవి నుంచి కాల్ వచ్చింది. మెగాస్టార్ హీరోగా రవిరాజా తెరకెక్కించిన జ్వాల చిత్రం ఇటు చిరుకి, అటు రవిరాజాకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చిన్న చిన్న చిత్రాలు తెరకెక్కించినా.. చిరంజీవితో చక్రవర్తి , యముడికి మొగుడు చిత్రాలు రవిరాజాను స్టార్ డైరెక్టర్ ను చేశాయి. అక్కడనుంచి రవిరాజా వెను తిరిగి చూసుకోలేదు. అప్పటి స్టార్ హీరోలందరికీ ఒకో సూపర్ హిట్టిచ్చారు రవిరాజా. బాలకృష్ణతో బంగారు బుల్లోడు, వెంకటేశ్ తో చంటి, రవితేజ తో వీడే , రాజశేఖర్ తో బలరామకృష్ణులు తెరకెక్కించి క్రేజీ దర్శకుడయ్యారు. రవిరాజా ఆఖరి చిత్రం అందమైన అబద్ధం. ప్రస్తుతం సినిమా పనులేమీ పెట్టుకోక.. తనయుడు ఆది పినిశెట్టి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. నేడు రవిరాజాపుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ దర్శకరాజాకి శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!