సోషల్ మీడియా రంగంలోకి ఇలా అడుగు పెట్టీ పెట్టగానే తనదైన స్పీడ్ చూపించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన గ్రాండ్ ఎంట్రీకి అభిమానులు భలేగా ఖుషీ అయ్యారు.  లాక్ డౌన్ టైమ్ కావడంతో .. ఆయన ట్వీటింగ్ స్పీడ్ మరింత పెరిగింది. దాదాపు నాలుగు నెలల్లోనే 100కి పైగా ట్వీట్స్ చేసి ఉత్సాహం చూపించారు. అయితే ఉన్నట్టుండి ట్విట్టర్ లో చిరు సైలెంట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

జూన్ 21న ఫాథర్స్ డేస్ సందర్భంగా చేసినదే చిరు లాస్ట్ ట్వీట్. దాని తర్వాత ఆయన్నుండి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. మెగాస్టార్ ఇలా సడెన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ నిన్న చిరు నుండి ట్వీట్స్ వచ్చాయి. ఒక స్ఫూర్తి కలిగించే వ్యక్తి గురించి చేసిన ట్వీట్ పై చిరంజీవి  స్పందించారు. కేరళకు చెందిన శివన్ అనే వ్యక్తి పోస్ట్ మ్యాన్ గా ఇటీవలే రిటైర్ అయ్యారు. ఆయన తన సర్వీస్ లో ప్రతిరోజూ దాదాపు 15 కిలోమీటర్లు అడవిలో క్రూర మృగాల భయాన్ని తప్పించుకుని తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాడని చేసిన ట్వీట్ పై చిరు స్పందించి అభినందించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం చాలా మందిని ఆకట్టుకుంటోంది.

 

Leave a comment

error: Content is protected !!