సూపర్ స్టార్ కృష్ణ నటజీవితంలో ఒక మేలిమలుపు లాంటి చిత్రం ‘అగ్ని పరీక్ష’. పద్మాలయా స్టూడియోస్ నిర్మించి.. ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆయన ఆ బ్యానర్ లో నిర్మించిన తొలి చిత్రం గా అగ్ని పరీక్ష ప్రత్యేకతను చాటుకుంది. 1970, జూలై 10న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కె.వరప్రసాదరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కృష్ణకు 47వ చిత్రం,శ్రీదేవి బాలనటిగా కనిపించిన రెండో చిత్రం అవడం విశేషం. మనిషిని మాణిక్యంగానూ, మాణిక్యాన్ని మసిగానూ చూసి చూపగల శక్తి ఒక విధికే ఉంది. అది ఆడే ఆటలో ఓడినా తట్టుకొని నిలదొక్కుకున్నవాడు జీవితంలో ఏదైనా సాధించగలడు అని నిరూపించిన చిత్రం. అప్పట్లో ఈ సినిమా ఒక విప్లవాత్మకమైన మహిళా కథా చిత్రంగా .. ఘన విజయం సాధించి..పద్మాలయ బ్యానర్ కు మంచి శుభారంభాన్నిచ్చింది. విజయనిర్మల కథానాయికగా నటించిన ఈ సినిమాకి ఆదినారాయణరావు సంగీతం అందించారు. కొండపై కొలువున్న మా తల్లి అనే పాట అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది.