తమిళ స్టార్ హీరో విశాల్ తన సొంత నిర్మాణంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తోన్న పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ ‘చక్ర’ . ఎర్లియర్ గా అయోగ్య, యాక్షన్ చిత్రాలతో మిశ్రమ ఫలితాలు అందుకున్న విశాల్ .. ఈ సారి సైబర్ థ్రిల్లర్ కథాంశంతో సరికొత్తగా రాబోతున్నాడు. ‘అభిమన్యుడు’ తరహాలో సాగే .. డిజిటల్ టెక్నాలజీ స్కామ్ థీమ్ తో ఈ సినిమా రూపొందుతోంది. బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో సరికొత్త కథ-కథనాలతో చక్ర తెరకెక్కుతోంది. ఈ సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన నాలుగు దక్షిణాది భాషల్లోని ట్రైలర్స్ విడుదలయ్యాయి.
‘ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్‌డే హైదరాబాద్ సిటీ మొత్తం హై అలర్ట్‌లో ఉంటుంది కానీ ఆరోజు..’ అని విశాల్ వాయిస్ ఓవర్‌తో మొదలైన 2నిమిషాల 10 సెకండ్ల నిడివిగల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మిలటరీ ఆఫిసర్‌గా విశాల్ పవర్‌ఫుల్ ఎంట్రీ స్టైలిష్‌గా ఉంది. కచ్చితంగా మనం వెతికే క్రిమినల్ మన కంటికి కనిపించడు, ఇప్పుడే కదా వేడెక్కింది ది గేమ్ బిగిన్స్, కంటికి కనిపించని వైరస్ మాత్రమే కాదు వైర్‌లెస్ నెట్‌వర్క్ కూడా ప్రమాదకరమే.. వెల్‌కమ్ టు డిజిటల్ ఇండియా వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇటీవల విడుదల చేసిన విశాల్ పవర్‌ఫుల్ లుక్‌తో కూడిన ‘చక్ర’ పోస్టర్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెంచేలా ఉన్నాయి. హీరోయిన్‌గా పోలీస్ ఆఫిసర్ పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ నటిస్తుండగా కీలక పాత్రలో రెజీనా కసాండ్ర నటిస్తోంది. ఎం.ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ట్రైలర్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి..
https://www.youtube.com/watch?v=N8B3chilPxI&feature=youtu.be