నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్  ‘దేవదాసు’. వినోదా వారి బ్యానర్ లో డి.యల్ . నారాయణ నిర్మాణ సారధ్యంలో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విషాద భరిత ప్రేమకథా చిత్రం టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. జూన్ 26 ,1953 లో విడుదలైన ఈ సినిమా 68 ఏళ్ళు పూర్తి చేసుకొంది.

సముద్రాల రచన, సి.ఆర్ .సుబ్బరామన్ సంగీతం దేవదాసు చిత్రానికి ప్రాణం పోశాయి.  ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర తన 16వ ఏట రచించిన దేవదాసు నవల ను  విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి తెలుగులోకి అనువందించారు. దాన్ని బేస్ చేసుకొనే తెలుగు దేవదాసు రూపుదిద్దుకుంది. పార్వతి గా సావిత్రి జీవించిన ఈ సినిమాలో  పేకేటి శివరామ్ , సురభి బాల సరస్వతి, సియస్ఆర్ , తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. దేవదాస్  చిత్రాన్ని ఎన్నో భాషల్లో రీమేక్ చేసారు. దాదాపు అన్ని భాషల్లోనూ ఈ సినిమా సక్సెస్ సాధించింది. చివరగా షారుఖ్ ఖాన్ హీరోగా ‘దేవదాస్’ సినిమా తెరకెక్కింది. తెలుగులో ‘దేవదాసు’ టైటిల్‌తో మరో మూడు చిత్రాలు వచ్చాయి. అందులో కృఫ్ణ, రామ్, నాగార్జున, నానిల సినిమా కూడా ఉంది. ఇక  దేవదాసు పాత్రకు అక్కినేని నాగేశ్వరావు ఐకాన్‌లా నిలిచారు. ఈ పాత్రను అక్కినేని రేంజ్లో ఇతర భాషల్లోని  నటులు ఎవరూ పండించలేకపోయారన్నది వాస్తవం. ఈ సినిమా రిపీట్ రన్‌లో 100 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. ఇది కూడ ఒక రికార్డు. ఇక అక్కినేని ‘దేవదాసు’ వచ్చిన 21 యేళ్లకు కృష్ణ అదే టైటిల్‌ అదే స్టోరీతో ‘దేవదాసు’ సినిమాను రీమేక్ చేసారు. ఈ సినిమా సాంకేతికంగా బాగానే ఉన్నప్పటికీ  అక్కినేని దేవదాసు‌ను మరిపించిలేక పోయింది.

Leave a comment

error: Content is protected !!