కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎక్కడి సినిమాలు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పట్లో షూటింగ్స్ జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాలు థియేటర్లలోకి వచ్చేలా లేవు. నిజానికి థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి. విడుదలకు సిద్ధమైన సినిమాల నిర్మాతలు ప్రస్తుతం ఓటిటిల మీద పడుతున్నారు. థియేటర్లు తెరిచే వరకు వెయిట్ చేయలేని వారంతా ఓటీటీలకు అమ్మేస్తున్నారు. సినిమాల‌ని న‌మ్ముకోవ‌డం కంటే ఓటీటీల‌ని న‌మ్ముకోవ‌డం మంచిద‌ని భావించిన కొంత మంది ఓటీటీల‌కు వెబ్ సిరీస్‌లు చేయ‌డానికి ముందుకొస్తున్నారు.

కొంత మంది ఏకంగా ఓటీటీల‌నే ఓపెన్ చేస్తున్నారు. తాజాగా న‌టుడు రాజా ర‌వీంద్ర కొత్త‌గా ఓటీటీని ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీనికి కంటెంట్ కావాల‌ని, రెడీగా కంటెంట్ వున్న వారు త‌మ‌ని సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని, వెబ్ సిరీస్ అయినా, వెబ్ ఫిల్మ్ అయినా చివ‌రికి షార్ట్ ఫిల్మ్ అయినా కంటెంట్ కొత్త‌గా వుంటే చాల‌ని త‌మ‌ని సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు. ఆల్ జోన‌ర్స్‌కి సంబంధించిన కంటెంట్‌ని తీసుకుంటామ‌ని, కొత్త‌గా వెబ్ సిరీస్ క‌థ‌లు వున్నా స‌రే త‌మ‌ని సంప్ర‌దించండ‌ని 9866661111 వాట్సాప్ నంబ‌ర్‌ని వెల్ల‌డించారు.

 

 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!