Shopping Cart 0 items - $0.00 0

రామ్ రాబర్ట్ రహీమ్

 

సూపర్ స్టార్ కృష్ణ నటజీవితంలో ఒక మరపురాని చిత్రం ‘రామ్ రాబర్ట్ రహీమ్’. రామ్ గా రజనీకాంత్, రాబర్ట్ గా కృష్ణ, రహీమ్ గా చంద్రమోహన్ నటించిన ఈ సినిమా అప్పట్లో  ఘన విజయం సాధించింది. పద్మావతి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంగీతం చక్రవర్తి అందించారు. శ్రీదేవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో త్యాగరాజు, అంజలీదేవి, జగ్గయ్య , ఫటా ఫట్ జయలక్ష్మి  ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ముగ్గురు అన్నదమ్ములు విధి వశాత్తు విడిపోయి.. ఒకరు హిందూ కుటుంబంలోను, మరొకరు క్రిష్టియన్ కుటుంబంలోనూ, ఇంకొకరు ముస్లీమ్ కుటుంబంలోనూ పెరిగి.. పెద్దవారై.. మళ్ళీ తమ తల్లిదండ్రుల్ని కలుసుకోవడమే ఈ సినిమా కథ. నిజానికి ఈ సినిమా 1977 లో బాలీవుడ్ లో విడుదలైన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కి రీమేక్ వెర్షన్. అమితాబ్, వినోద్ ఖన్నా, రిషీ కపూర్ నటించిన ఈ సినిమా  బాలీవుడ్ లో దుమ్మురేపేసింది.   తర్వాత ఇదే చిత్రం తమిళంలో ‘శంకర్ సలీమ్ సైమన్’ గానూ, మలయాళంలో ‘జాన్ జాఫర్ జనార్ధన్’ గానూ, విడుదలై ఆయాభాషల్లోనూ ఘన విజయం సాధించింది. 1980లో సరిగ్గా కృష్ణ పుట్టిన రోజు నాడు విడుదలైన ‘రామ్ రాబర్ట్ రహీమ్’ చిత్రం ఆయన కెరీర్ లోనే చాలా ప్రత్యేకమైనది గా నిలిచిపోయింది. 

 

Leave a comment

error: Content is protected !!