కరోనా లాక్ డౌన్ .. అందరి జీవితాలపైనా  తీవ్రమైన ప్రభావం చూపించింది. అన్ని రంగాలకు తీరని నష్టం ఏర్పరిచింది. ముఖ్యంగా సినీ రంగానికి దాని ప్రభావం శాపంలా తగులుకుంది. కొత్త సినిమాల షూటింగ్స్ లేవు, కొత్త రిలీజెస్ లేవు, థియేటర్స్ మూతపడ్డాయి. దాని వల్ల మన కథానాయికలకు ఏ రకంగానూ.. ఏవిధమైన పనిలేకుండా పోయింది.  ముఖ్యంగా సోషల్ మీడియాలో వారి అందాల ఫోటో షూట్స్ కానరాకుండడం నెటిజెన్స్ కు పెద్ద బోరింగ్ వ్యవహారం అయింది.

లాక్ డౌన్ ప్రారంభమైన కొత్తల్లో వంటలు చేస్తూనో.. గేమ్స్ ఆడుతోనో.. లేక కుటుంబ సభ్యులతో కలిసి కులాసాగా కబుర్లాడుకోవడంలోనో యాక్టివ్ గా ఉంటూ .. ఇన్ స్టా గ్రామ్ లోనో , ట్వట్టర్ లోనో కనిపిస్తూండే  అనుష్కా, త్రిష,కాజల్ , సమంతా, నయనతార, శ్రుతిహాసన్, రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ , పూజా హెగ్డే, రష్మికా మందణ్ణ లాంటి భామా మణులు.. రాను రాను ఆ ప్రోగ్రామ్స్ కు గుడ్ బై చెప్పేశారు. బహుశా మేకప్పుల్లేని ఆ ఫేసెస్ ను నెటిజెన్స్ కు చూపించడానికి ఇష్టం లేకో ఏమో గానీ.. ఇప్పుడు ఒక్క బ్యూటీ  కూడా ట్వట్టర్ లోనో, ఇన్ స్టా గ్రామ్ లోనో యాక్టివ్ గా ఉండడం లేదన్నది వాస్తవం. మరి లాక్ డౌన్ తగ్గాకా ఏమైనా  .. మళ్ళీ ఫోటో షూట్స్ లో సందడి చేస్తారేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!