కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా సినిమా షూటింగులకు అంతరాయం ఏర్పడింది. సినిమా థియేటర్స్ కు తాళాలు పడ్డాయి. దీని వల్ల సినిమా రిలీజులు ప్రశ్నార్ధకంలో పడ్డాయి. దీంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీలకు అమ్మేస్తున్నారు. భారీ ఆఫర్స్ ఇవ్వడంతో .. ఓటీటీలకు డిమాండ్ ఎక్కువైంది. దీంతో పలువురు హీరో, హీరోయిన్స్ .. దర్శక,నిర్మాతలు అటు వైపుగా అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశముదురు ఫేమ్ హన్సికా మొత్వానీ కూడా ఓటీటీల వైపు దృష్టిసారించింది,

త‌మిళంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హ‌న్సిక గ‌త కొంత కాలంగా హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కే ప‌రిమితం అవుతోంది. తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది. డిజిట‌ల్ రంగంలో త‌న స‌త్తా చాటాల‌ని హ‌న్సిక‌ భావిస్తోంద‌ట‌. అందులో భాగంగానే హ‌న్సిక ఓ వెబ్ సిరీస్‌ని ఓకే చేసింద‌ని చెబుతున్నారు.  అనుష్క‌తో `భాగ‌మ‌తి` లాంటి భారీ చిత్రాన్ని తెర‌కెక్కించిన అశోక్ ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించ‌నున్న‌ట్టు సమాచారం. స‌మాజంలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న ఓ బ‌ల‌మైన స‌మ‌స్య నేప‌థ్యంలో ఈ వెబ్ సిరీస్ వుంటుంద‌ని, కొత్త పంథాలో ఈ వెబ్ సిరీస్‌ని ద‌ర్శ‌కుడు అశోక్ తెర‌పైకి తీసుకురానున్నార‌ని తెలుస్తోంది.

 

Leave a comment

error: Content is protected !!