అతడి పేరు కోలీవుడ్ లో ఒక వైబ్రేషన్.. అతడి ప్రతీ సినిమా అభిమానులకు ఒక సెలబ్రేషన్. డైలాగ్స్ చెప్పడంలోనూ, ఫైట్స్ లోనూ, డ్యాన్స్ లోనూ అతడిది ప్రత్యేకమైన శైలి. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న దళపతి అతడు. పేరు విజయ్.  అతడి సినిమా విడుదలవుతోందంటే చాలు..  అభిమానుల్లో సందడి మొదలవుతుంది. థియేటర్స్ బ్యానర్స్ తో , పాలాభిషేకాలతో కళకళలాడుతాయి. నిన్నటి తరం దర్శకుడు యస్.ఏ.చంద్రశేఖర్ తనయుడిగా.. సినీ రంగంలోకి అడుగుపెట్టిన అతడు..  తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ , స్టార్ డమ్  సంపాదించుకున్నాడు.

విజయ్ కోలీవుడ్ లో.  బాలనటునిగా తన తండ్రి దర్శకత్వం వహించిన “వెట్రి” నుంచి  ఇదు ఎంగళ్ నీతి వరకు నటించాడు. యుక్త వయస్సులో  తండ్రి దర్శకత్వంలోనే “నాలయ తీర్పు” చిత్రంతో  హీరోగా ప్రవేశించాడు కానీ తన మొదటి విజయవంతమైన సినిమా 1996లో విడుదలైన “పూవె ఉనక్కాగ” (తెలుగులో శుభాకాంక్షలు). ఈ చిత్రానికి విక్రమన్ దర్శకత్వం వహించాడు. విజయ్ యిప్పటి వరకు ఆయన 61 చిత్రాలలో నటించాడు. మూడు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్సు, ఒక కాస్మోపోలిటన్ పురస్కారం, ఎనిమిది విజయ్ పురస్కారాలు, మూడు ఎడిసన్ పురస్కారాలు, రెండు వికటన్ పురస్కారాలు అందుకున్నాడు. నేషనల్ అవర్డు యు.కెకు నామినేట్ చేయబడ్డాడు. ఆయన ఇప్పటి వరకు 32 పాటలను పాడాడు. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నేడు విజయ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే విజయ్ ..

 

 

Leave a comment

error: Content is protected !!