యాక్షన్ విత్  రివెంజ్ స్టోరీస్ ఆ దర్శకుడి  ఫార్మేట్. బలమైన కాన్ ఫ్లిక్ట్ తో కూడిన డ్రామా ఆ కథల్లో అండర్ కరెంట్ గా ఉంటుంది. తొలి చిత్రం తప్ప.. మిగిలిన మూడు చిత్రాలూ అదే ఫార్ములాతో రూపొందినవే. ఆ దర్శకుడి పేరు సంపత్ నంది.  మాస్ యాక్షన్ చిత్రాలు తీయడంలో తనకో ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు. తీసినవి నాలుగే నాలుగు చిత్రాలు. వాటితోనే అతడు తన ఇమేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేశాడు.

వరంగల్ జిల్లా హనుమకొండ సంపత్ నంది స్వగ్రామం . పదో తరగతి వరకూ అక్కడే  చదివాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు వరుసగా చూసి వాటిని రచయిత ధృక్కోణంలో విశ్లేషించే వాడు. నెల్లూరు లో  ఇంటర్మీడియట్ చదివాడు. తర్వాత రాయచూరులో బిఫార్మసీ పూర్తి చేశాడు. పోసాని కృష్ణమురళి సంభాషణల మీద ఆసక్తి కలిగి ఓ సినిమా డైరీ సహాయంతో ఆయన ఫోను నంబరు సంపాదించి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. ఆయన ముందుగా డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నాడు. తన దగ్గర పనిచేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆ స్థానంలో ఇతనికి ఆహ్వానం పంపాడు పోసాని. ఆ తరువాత మూడు సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు సంపత్ . అదే సమయంలో ముంబై, బెంగళూరు ల్లో ప్రకటనలు రూపొందించేవాడు. ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా మారాడు సంపత్ నంది . కేవలం 3 కోట్ల బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం సుమారు 80 లక్షలకు పైగా లాభాన్ని ఆర్జించి పెట్టింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వారం రోజుల్లోనే ఏడు అవకాశాలు వచ్చాయి. రామ్ చరణ్ తో తీసిన  రచ్చ, రవితేజ తో తీసిన బెంగాల్ టైగర్. సంపత్ నందికి యాక్షన్  డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే  గోపీచంద్ తో తెరకెక్కించిన గౌతమ్ నంద చిత్రం మాత్రం  పరాజయం పాలైంది. ప్రస్తుతం సంపత్ నంది గోపీచంద్ తోనే ‘సీటీమార్’ అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. నేడు సంపత్ నంది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ ఎనర్జిటిక్ డైరెక్టర్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే సంపత్ నంది….

Leave a comment

error: Content is protected !!