మెగాఫ్యామిలీలో ఒక్క వరుణ్ తేజ తప్ప.. మిగతా ఇద్దరు స్టార్ హీరోల (చరణ్, బన్నీ) పెళ్ళిళ్ళు అయిపోయాయి. దానికి కారణం ముందుగా వరుణ్ చెల్లెలు నీహారిక పెళ్లి అవ్వాలి కాబట్టి. మంచి వరుడి కోసం అన్వేషించి .. ఫైనల్ గా ఒక మంచి కుర్రోడ్ని సెలెక్ట్ చేశారు నాగబాబు అండ్ ఫ్యామిలీ. నిహారిక పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని స్పష్టతనివ్వడంతో వరుడు ఎవరు? అనే చర్చ మొదలైంది. దీనిపై నిహారిక సస్పెన్స్ ని కొనసాగించాలని ప్రయత్నించింది.
తాను వివాహం చేసుకోబోయే వరుడు ఎవరనే విషయంలో నిహారిక ఎంత సస్పెన్స్ మెయిన్ టెయిన్ చేయాలనుకున్నా వరుడెవరో తెలిసిపోయింది. గుంటూరు కు చెందిన ఐజీ తనయుడు చైతన్య అనే అబ్బాయే నిహారికకు కాబోయే వరుడు. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన చైతన్య జెవి ఓ ఎమ్మెన్సీలో సాఫ్ట్ వేర్ గా వర్క్ చేస్తున్నాడు. గత కొంత కాలం క్రితం నిహారిక కు అతనికి పరిచయం ఏర్పడిందట. వీరి పెళ్ళికి మెగా ఫామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఇరు కుటుంబాల వారు ఇప్పటికే పెళ్లిపై ఓ నిర్ణయానికి వచ్చారట. తాజాగా నిహారిక – చైతన్య కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు లో ఎంగేమేంట్ జరపాలని ఇరు కుటుంబాల వాళ్ళు ముహూర్తం నిర్ణయించినట్టు తెలిసింది.