Shopping Cart 0 items - $0.00 0

అల్లు అరవింద్ బర్త్ డే నేడు

చలనచిత్ర నిర్మాణంలో అపారమైన అనుభవమున్న నిర్మాత ఆయన. విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్. టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్ లో ఆయన కూడా ఒకరు. పేరు అల్లు అరవింద్ . హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య వారసుడిగా .. 1974 లో గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి.. ‘బంట్రోతు భార్య’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. అందులో ముఖ్యంగా ఆయన బావ మెగాస్టార్ చిరంజీవితోనే అత్యథిక సినిమాలు నిర్మించి హీరోగా ఆయన అభివృద్ధికి కారకులయ్యారు. ఇక ఆయన ‘మహానగరంలో మాయగాడు, హీరో, చంటబ్బాయ్’ లాంటి చిత్రాల్లో తనదైన శైలిలో కామెడీ పండించి.. మంచి హాస్యనటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోగా ..తనయుడు అల్లు అర్జున్ అగ్రస్థానంలోకి దూసుకుపోతుంటే.. అతడి ఎదుగుదలకు మురిసిపోతూ.. మరో పక్క గీతా ఆర్ట్స్ బ్యానర్ 2 మీద పలు చిన్న చిత్రాలు నిర్మిస్తూ.. అగ్ర నిర్మాతగా తన స్థానాన్నిమరింత సుస్థిరం చేసుకున్నారు . నేడు ఆయన బర్త్ డే ఈ సందర్భంగా అల్లు అరవింద్ కు విషెస్ తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
Happy birthday allu aravind

Leave a comment

error: Content is protected !!