సూపర్ స్టార్ కృష్ణ కు మహాకవి శ్రీశ్రీ అవార్డు 2020ను అందజేయనున్నట్టు సుంకర టి.కృష్ణ మెమోరియల్ , నాగార్జున కళా పరిషత్తు అధ్యక్షుడు దేవినేని కిషోర్ కుమార్ , ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ విజయవాడ అధ్యక్షుడు కొల్లూరి ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశ్రీ 37వ వర్ధంతి సందర్భంగా ఈ అవార్డు ప్రకటించినట్టు తెలిపారు. సినీ,సాహితీ రంగాల్లో విశేష సేవలందించిన వారికి మహాకవి శ్రీశ్రీ అవార్డును 2016నుంచి అందిస్తున్నట్టు తెలిపారు.

5దశాబ్దాలకు పైగా 350 పైచిలుకు చిత్రాల్లో నటించి, దర్శకుడిగా, నిర్మాతగా అద్భుతమైన చిత్రాల్ని అందించి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసిన కృష్ణకు ఈ అవార్డు అందుకోవడానికి అంగీకరించడం సంతోషదాయకమన్నారు. లాక్ డౌన్ అనంతరం సూపర్ స్టార్ కృష్ణకు ఈ అవార్డు ప్రదానం చేయబోతున్నట్టు కొల్లూరి తెలిపారు.

Leave a comment

error: Content is protected !!