లాక్ డౌన్ కారణంగా బైటికి వెళ్లలేని పరిస్థితులు. కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ.. చాలా మంది బార్బర్ షాప్ కు వెళ్లి హెయిర్ కట్ అండ్ షేవింగ్ చేయించుకోవడం అనే రిస్క్ ను తీసుకోవడం లేదు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ ఈ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ వెటరన్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టికి తనయుడు ఆది పినిశెట్టి కి హెయిర్ కట్ చేసి.. అందరినీ ఆకట్టుకున్నాడు.
తండ్రిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి.. చాలా ప్రొఫెనల్ గా హెయిర్ కట్ చేశాడు ఆది. అంతేకాదు .. అలా చేసినందుకు డబ్బులు కూడా అడిగి మరీ తీసుకున్నాడు. తన తండ్రికి హెయిర్ కట్ చేసిన వీడియోను ఆది పినిశెట్టి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. డబ్బులు చాల్లేందంటూ.. ఆయన పర్స్ లోంచి బలవంతంగా డబ్బులు తీసుకొని ఆది అందరినీ నవ్వించాడు. ఒకప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టరయిన రవిరాజా పినిశెట్టి.. ప్రస్తుతం తనయుడి సక్సెస్ కు సంతోషిస్తూ.. తన సొంత ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు.
#Haircut timeeee!!
iam sure I need one more than my Dad😉#lockdownlife#staypositive pic.twitter.com/uUAOW2FDuo— Aadhi's (@AadhiOfficial) June 16, 2020