ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఉత్తమ ఛాయాగ్రాహకునిగా బి.కణ్ణన్ ప్రసిద్ధికెక్కారు. ఈయన  కెమెరా కన్ను పడిన ప్రతీ చిత్రం కూడా దృశ్యకావ్యమైపోయేది. ఆ ప్రతిభావంతుడు ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. దాదాపు నాలుగు దశాబ్దాల కాలం పాటు .. తమిళ, మలయాళ చిత్రాలకు అద్భుతమైన ఛాయా గ్రహణం అందించిన ఆయన భారతీరాజా చిత్రాలకు ఎక్కువగా పనిచేశారు. అందుకే ఆయన్ను భారతీరాజా కళ్ళు అని పిలుచేవారు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో చెప్పుకోదగ్గ సినిమాలు తెరకెక్కించిన ఏ . భీమ్ సింగ్ తనయుడే కణ్ణన్. ఆయన   మరణానికి పలువురు దక్షిణాది  సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. 

Leave a comment

error: Content is protected !!